ప్రస్తుతం మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది వీటికి బలి అవుతున్నారు. కొందరు దుర్మార్గులు అయితే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఇలాంటి ఘటనలే. ముఖ్యంగా 10 ఏళ్ల లోపు బాలికలపై ఎక్కువగా ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. పిల్లలు అని చూడకుండా కొందరు వదలడం లేదు. మనిషి పెరిగే విధానంలో తప్పా? లేకపోతో ఆలోచనలో తప్పో తెలియడం లేదు. కానీ రోజురోజుకీ అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. అయితే తాజగా బిహార్‌లో కూడా ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి.. బిహర్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలికను సొంత మేనమామ అత్యాచారం చేశాడు. పని మీద మేనమామ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి మేనమామ ఆ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. మాట వినకపోయే సరికి ఆమెను ఇంట్లో మంచానికి ఆమెను కట్టేసి మరి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్ మేనమామ ఇంటికి వెళ్లిన బాలిక రాకపోయే సరికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లగా కూతురు శవమై కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని పోలీసులకు అప్పగించారు. బాలిక ఇలా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. సొంత మేనమామ అత్యాచారం చేసి చంపడంతో ఏడుస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కొందరు దుండగులు చిన్న పిల్లలు అని చూడకుండా దారుణానికి పాల్పడుతున్నారు. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు