Man murder wife :‘మీ అమ్మాయిని చంపి సూట్‌కేస్‌లో పెట్టిన’ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు

రాకేష్ భార్య గౌరీని మార్చి 26న హత్య చేసి సూట్‌కేసు‌లో పెట్టి పారిపోయాడు. తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి భర్యను హత్య చేసినట్లు చెప్పాడు. ఈఘటన బెంగుళూర్‌ హులిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
man murder wife

man murder wife Photograph: (man murder wife)

భార్యను హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి భర్త పారిపోయాడు. అనంతరం అత్తమామలకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూణేకు చెందిన రాకేష్ (32) హిటాచీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. భర్య గౌరీ సాంబేకర్ మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్‌లో పని చేస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఈ జంట గత 2 నెలలుగా కర్ణాటకలోని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో దొడ్డకన్నహళ్లిలో నివసిస్తున్నారు. మార్చి 26న భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదై ఆవేశానికి గురైన రాకేష్.. గౌరి కడుపులో కత్తితో పొడిచాడు. తర్వాత ఆమె గొంతు కోశాడు. భార్య మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి రాకేష్ పూణేకు పారిపోయాడు. 

Also read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

Also read: AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్

గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి హత్య చేసిన విషయాన్ని చెప్పాడు. డెడ్‌బాడీ సూట్‌కేస్‌లో పెట్టి బాత్ రూమ్‌లో ఉంచానని తెలియజేసింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గౌరీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రాకేష్‌ను బెంగళూర్ పోలీసులు పూణేలో అరెస్టు చేశారు. నిందితుడిని కాల్ డిటైల్ రికార్డ్స్ ఉపయోగించి ట్రాక్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. భార్య అతన్ని కొడుతుండేదని పోలీస్ ఆఫీసర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఆమె భర్తపై దాడి చేసిందని సమాచారం. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా కేసుకు సంబంధించిన విషయాలు మీడియాకు తెలిపారు. హులిమావు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి చేరుకునేసరికి తాళం వేసి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత, బాత్రూంలో ఒక సూట్‌కేస్ కనిపించింది. FSL టీం సూట్‌కేస్ తెరిచి చూడగా, ఓ మహిళ డెడ్‌బాడీ మొత్తం గాయాలతో కనిపించిందని ఆమె చెప్పారు.

Advertisment
తాజా కథనాలు