AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మందికి ఎయిడ్స్

కేరళ మలప్పురం జిల్లా వాలంచెరి మున్సిపాలిటీలో ఒకేసారి 10 మందికి HIV పాజిటివ్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది ఒకే ఇంజెక్షన్ సిరంజీతో డ్రగ్స్ వాడినట్లు తేలింది. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

author-image
By K Mohan
New Update
AIDS with drugs

AIDS with drugs Photograph: (AIDS with drugs)

పది మందికి ఎయిడ్స్ ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించారు. కారణం తెలుసుకున్న వైద్యులు షాక్ అయ్యారు. వారు తీసుకున్న డ్రగ్స్ ప్రాణాంతకమైన వ్యాధి సోకడానికి కారణమైంది. కేరళ మలప్పురం జిల్లాలోని వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకేసారి 10 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూది ఇంజెక్షన్ వాడినట్లు అధికారులు తెలిపారు. ఈ 10 మందిలో ఏడుగురు కేరళ వాసులు కాగా.. మరో ముగ్గురు వివిధ రాష్ట్రాలకు చెందినవారు అని వైద్యారోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఇంజెక్షన్‌ సిరంజీని ఉపయోగించి వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. వైద్య అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

Also read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

2025 జనవరిలో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో మొదట ఒక HIV రోగిని గుర్తించింది. ఈ కేసు బయటపడిన తర్వాత.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసినపుడు సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఈ HIV సోకిన వారంతా డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటగా ఈ 10 మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా.. అతడు ఉపయోగించిన ఇంజెక్షన్ సిరంజీని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని.. అందుకే వారందరికీ హెచ్ఐవీ సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ 10 మందిని కేరళ వైద్య శాఖ అధికారులు తమ పర్యవేక్షణలో ఉంచారు.

Also read: Immigration Bill 2025: ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bus Accident : ఆర్టీసీ బస్సు బీభత్సం..తండ్రి స్పాట్.. చావుబతుకుల్లో కూతురు!

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుడిని సబ్ ఇన్‌స్పెక్టర్ నాగరాజ్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో ఆయన కుమార్తె కూడా ఉంది.

New Update
Karnataka Bus Accident

కర్ణాటక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు  డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.  మృతుడిని సబ్ ఇన్‌స్పెక్టర్ నాగరాజ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఆయన కుమార్తె కావ్య కూడా ఉన్నారు.  ఈ సంఘటన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కగ్గలిపుర పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనకపుర నుండి బెంగళూరుకు వెళుతున్న బస్సు రెండు బైక్స్ పైకి దూసుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇద్దరి పరిస్థితి విషమం

ఈ ఘటనలో బస్సుతో పాటు బైకులు కూడా కాలువలో పడిపోయాయి. గాయపడిన వారు ఐసియూలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు లోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణానికి సంబంధించి కగ్గలిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో, స్టీరింగ్ కేబుల్ తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ పేర్కొన్నాడు. కాగా వంపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

rtc-bus | bus-accident | telugu-news 

 

Advertisment
Advertisment
Advertisment