తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. 

New Update
tamilanadu road accident

tamilanadu road accident Photograph: (tamilanadu road accident)

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. 

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కిలోమీటర్ మేరా నిలిచింది ట్రాఫిక్. గంటపాటు మంటలు ఆర్పి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు అగ్నిమాపక సిబ్బంది. గాయాలపాలైన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు