/rtv/media/media_files/2025/10/24/why-sleeper-buses-meet-with-accidents-2025-10-24-16-12-20.jpg)
Why sleeper buses meet with accidents
కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. కావేరి ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 10 రోజుల క్రితం రాజస్థాన్‌లో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదమే చోటుచేసుకుంది. ఓ స్లీపర్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. మెయిన్ లాక్ అయిపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. దీంతో ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందారు. కేవలం ఈ ఘటనలే కాదు గత కొన్నేళ్ల నుంచి స్లీపర్ బస్సుల్లో ఇలాంటి అగ్నిప్రమాద ఘటనలు భారీగా ప్రాణనష్టాన్ని మిగుల్చుతున్నాయి. మరి ఈ ప్రమాదాలకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రమాదాలకు కారణం ?
స్లీపర్ బస్సుల్లో 2*1 సీటింగ్ ఉంటుంది. దాదాపు 30 నుంచి 36 బెర్తులు ఉంటాయి. మల్డీ యాక్సిల్ బస్సుల్లో 36-40 బెర్తులు ఉంటాయి. ఒక్కొ బెర్త్ ఆరడుగల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుంది. బెర్తులను లింక్ చేసే గ్యారీతోనే సమస్యలు వస్తున్నాయి.ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉంటాయి. ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లగలరు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు వెంటనే బయటకు రాలేకపోతున్నారు. అగ్నిప్రమాదం లాంటివి జరిగినప్పుడు ప్రయాణికులు లోపలే చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు స్లీపర్ బస్సుల ఎత్తు కూడా ఇక్కడ ఓ సమస్యే. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. దీంతో బయటఉండేవారు బస్సు అద్దాలను బ్రేక్ చేసేందుకు ఇబ్బంది అవుతుంది.
డ్రైవర్లకు అలసట
వాస్తవానికి ప్రయాణికులు 300 నుంచి 1000 కిలోమీటర్లు దూరం వెళ్లేందుకు ఎక్కువగా స్లీపర్ బస్సులనే ఎంచుకుంటారు. ఈ బస్సులు ముఖ్యంగా రాత్రి సమయంలోనే ప్రయాణిస్తాయి. దీనివల్ల డ్రైవర్‌కు అలసట లేదా నిద్రమత్తు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరగొచ్చు. అధునాతన బస్సుల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ వాటి పనితీరు, సామర్థ్యంపై అనుమానాలున్నాయి. 2018లో బస్సు డ్రైవర్లకు సంబధించి ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 25 శాతం మంది డ్రైవర్లు డ్రైవింగ్ సమయంలో తాము నిద్ర మత్తులో ఉంటున్నామని అంగీకరించారు. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి ఉదయ 6 గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read: ఆ SI 4సార్లు రే*ప్ చేశాడు.. లేడీ డాక్టర్ చేతి మీద సూ*సైడ్ నోట్
మొదటి రెండు నిమిషాలే కీలకం
బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మొదటి రెండు నిమిషాలు కీలకం. స్లీపర్ బస్సుల్లో ఎక్కువమంది ప్రయాణికులు నిద్రలో ఉంటారు. ప్రమాదం జరిగినప్పుడు సీట్లలో మెలుకువగా ఉండేవాళ్లు లేదా వెంటనే నిద్రలోనుంచి లేచేవారు ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉంటుంది. కానీ అప్పర్ బెర్త్‌లో ఉన్నవాళ్లు మాత్రం బయటపడటం కష్టంగా ఉంటోంది.
Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే చెప్పాల్సిందే.. కేంద్రం IT చట్టంలో మార్పులు!
చైనాలో స్లీపర్ బస్సులు నిషేధం
ముందుగా పశ్చిమ దేశాల్లో ఈ స్లీపర్ బస్సులను నడిపేవారు. నగరాల్లో వినోద ప్రయాణాల కోసం వీటిని వాడేవారు. ఆ తర్వాత వీటిని ప్రజా రవాణాలోకి తీసుకొచ్చారు. అయితే స్లీపర్ బస్సుల్లో జరుగున్న ప్రమాదాల వల్ల పలు దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. చైనాలో చూసుకుంటే 2009 తర్వాత 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 252 మంది మృతి చెందారు. దీంతో 2012లో ఈ స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్లను చైనా నిలిపివేసింది. కేవలం 2012కు ముందు ఉన్న కొన్ని స్లీపర్ బస్సులు మాత్రమే ఇప్పుడు అక్కడ నడుస్తున్నాయి. మన దేశంలో కూడా స్లీపర్ బస్సులను నిషేధించాలనే ఓ డిమాండ్ కూడా వినిపిస్తోంది.
Follow Us