Crime News : యూపీలో దారుణం.. ప్రియుడితో కలిసి మొగుడ్ని లేపేసిన భార్య!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న మొగుడ్ని చంపేసింది ఓ భార్య. మళ్లీ ఏమీ తెలియనట్టు భర్త శవం దగ్గరే మొసలి కన్నీరు కార్చింది. చందా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిండిపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
up crime

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న మొగుడ్ని చంపేసింది ఓ భార్య. మళ్లీ ఏమీ తెలియనట్టు భర్త శవం దగ్గరే మొసలి కన్నీరు కార్చింది. చందా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిండిపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 18ఏళ్ల క్రితం మహేష్‌తో పూజకు వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. జైశంకర్ అనే వ్యక్తితో పూజకు పరిచయం ఏర్పడగా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది పూజ.  ప్రియుడు గొంతు కోయగా, భర్త ఛాతిపై ఇటుకతో కొట్టింది పూజ.  కాల్‌ రికార్డుల ఆధారంగా భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు