Hyderabad : పాపం...అన్న బిడ్డ, అల్లుడిని ఫ్లైటెక్కించి వెళ్తుండగా.. యాక్సిడెంట్లో

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన మిగిలిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

author-image
By Krishna
New Update
keesara orr accident

keesara orr accident

కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మంచిర్యాలకు చెందిన విజయ్ (50) వ్యవసాయం పనులు చేస్తున్నాడు.  అయితే తన అన్న బిడ్డ, అల్లుడు విదేశాలకు వెళ్తుండడంతో వారిని ఫ్లైట్ ఎక్కించడానికి మంగళవారం అన్న రాములు, వదిన విజయ, అక్క లక్ష్మి, మరో స్నేహితుడు కొమురయ్యతో కలిసి మంగళవారంరాత్రి స్విఫ్ట్ కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. అయితే వారిని ఫ్లైట్ ఎక్కించాక బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓఆర్ఆర్ మీదుగా తిరిగి తన స్వగ్రామానికి బయలుదేరారు.  

Also read :  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

నిద్ర వస్తుండడంతో కారు డోర్ తీసి

అయితే ఈ సమయంలో కొమురయ్య కారు నడుపుతుండగా, విజయ్ పక్కనే కూర్చు కున్నాడు. కీసర పరిధిలోని యాద్గార్పల్లి దాటిన తర్వాత తనకు నిద్ర వస్తుండడంతో పక్కనే కూర్చన్న విజయ్ ను బండి నడపమని కొమురయ్య కారును పక్కకు ఆపాడు. దీంతో విజయ్ కారు డోర్ తీసి, వెనుక నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కంటైనర్ అతడితో పాటుగా కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ స్పాట్ లోనే మృతి చెందగా, లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన మిగిలిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read :  రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

Also Read :  MLC Nagababu : అన్నయ్యా.. ఇది నాకెంతో స్పెషల్.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్!
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు