Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

డిజిట‌ల్ అరెస్టు కారణంగా రిటైర్డ్ క‌ల్నల్ దంప‌తులు రూ.3.4 కోట్లు  కోల్పోయారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి 10 రోజులు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. రిటైర్డ్ క‌ల్నల్ ద‌లీప్ సింగ్‌(82), ఆయ‌న భార్య ర‌వీంద‌ర్ కౌర్ బాజ్వాతో చండీఘ‌డ్‌లో సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు.

New Update
retired Colonel

retired Colonel Photograph: (retired Colonel)

డిజిట‌ల్ అరెస్టు కారణంగా రిటైర్డ్ క‌ల్నల్ దంప‌తులు భారీగా మోస‌పోయారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి సేవ్ చేసుకున్న రూ.3.4 కోట్లు  కోల్పోయారు. ప‌ది రోజుల పాటు మోస‌గాళ్లు ఆ దంప‌తుల్ని డిజిట‌ల్ అరెస్టు చేసి ఆ మొత్తాన్ని కాజేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. 82 ఏళ్ల రిటైర్డ్ క‌ల్నల్ ద‌లీప్ సింగ్‌, ఆయ‌న భార్య ర‌వీంద‌ర్ కౌర్ బాజ్వాతో క‌లిసి చండీఘ‌డ్‌లోని సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు. అయితే ఈడీ అధికారుల‌మంటూ మోస‌గాళ్లు ఆ వృద్ధ జంట‌ను మోసం చేశారు. తొలుత వాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి బెదిరించారు. ఆ త‌ర్వాత కోర్టు నోటీసులు ఇచ్చి భయపెట్టారు. చండీఘ‌డ్ సైబ‌ర్ సెల్‌లో ఆ వృద్ధ జంట ఫిర్యాదు చేసింది.

Also read: Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

మార్చి 18న సింగ్‌కు గుర్తు తెలియ‌ని నెంబ‌ర్ నుంచి వాట్సాప్ కాల్ వ‌చ్చింది. ముంబైలోని కెన‌రా బ్యాంక్‌తో ఉన్న అకౌంట్‌తో మ‌నీ ల్యాండ‌రింగ్ లింకు ఉన్నట్లు ఆ కాల్‌తో సింగ్‌ను బెదిరించారు. జెట్ ఎయిర్‌వేస్ ఓన‌ర్ న‌రేశ్ గోయ‌ల్‌కు మ‌నీ ల్యాండ‌రింగ్ చేసినట్లు సైబ‌ర్ నేర‌గాళ్లు ఆరోపించారు. ముంబైలో ద‌లీప్ సింగ్ బజ్వా పేరుతో అకౌంట్ ఉన్నట్లు ఆయ‌న భార్యకు నేర‌గాళ్లు ఫోన్ చేశారు. భ‌ర్త పేరుతో ఉన్న ఓ కార్డును కూడా చూపించారు.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

సింగ్ పేరుతో ఉన్న కార్డును చూపించి. 5 వేల కోట్ల ఫ్రాడ్‌తో క‌నెక్షన్ ఉన్నట్లు బెదిరించార‌ని కౌర్ పేర్కొన్నది. ఆ స్కామ్‌లో 24 మంది బాధితులు ఉన్నట్లు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశారని చెప్పిందామె. మార్చి 18 నుంచి 27వ తేదీ వ‌ర‌కు సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ వృద్ధ దంప‌తుల్ని డిజిట్ అరెస్టు చేశారు. ఫోన్లు ఎప్పటికీ ఆన్‌లో పెట్టుకోవాల‌ని ఆ జంట‌ను నేర‌గాళ్లు హెచ్చరించారు. ఎవ‌ర్నీ కాంటాక్టు కావొద్దన్నారు. విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే అరెస్టు చేస్తామ‌ని బెదిరించారు. సుప్రీంకోర్టు లెట‌ర్ ప్యాడ్‌తో ఉన్న లేఖ‌ల్ని కొన్ని చూపించారు. అయితే తీవ్ర వ‌త్తిడికి లోనైన ఆ జంట‌.. త‌మ అకౌంట్ల‌లో దాచుకున్న 3.4 కోట్లను సైబ‌ర్ నేర‌గాళ్లకు చెందిన వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు