Heart Attack In Gym: షాకింగ్ వీడియో.. జిమ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

జబల్పూర్‌లో 52ఏళ్ల యతీష్ సింఘై జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. అయితే, జిమ్ లోని సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

New Update
Heart Attack In Gym

Heart Attack In Gym

Heart Attack In Gym: మధ్యప్రదేశ్‌, జబల్పూర్ నగరంలోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గోల్డ్స్ జిమ్‌కి రెగ్యులర్‌గా వచ్చే యతీష్ సింఘై (52) అనే వ్యక్తి జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జిమ్‌లోని సీసీటీవీలో రికార్డు కావడంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం..

యతీష్ ఉదయం 6:45కి జిమ్‌కు చేరుకుని ఎప్పటిలాగే వ్యాయామాన్ని ప్రారంభించాడు. వివిధ జిమ్ మెషిన్లపై సాధన చేస్తుండగానే ఆయన అకస్మాత్తుగా నేలపై పడిపోయారు. ఈ విషయాన్నీ గమనించిన ఇతర జిమ్ సభ్యులు, సిబ్బంది వెంటనే స్పందించి సీపీఆర్ సహా తక్షణ చికిత్స చర్యలు తీసుకున్నారు.

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

వెంటనే ఆయనను సమీపంలోని భండారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యతీష్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. అయితే జిమ్, వ్యాయామాలు చేసేవారు ఆరోగ్య పరిస్థితులపై ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు