/rtv/media/media_files/2025/04/18/IdsOtS6jRDWtJ9eHyeOK.jpg)
Burhanpur
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను బీరు బాటిల్తో పొడిచి చంపేసిన భార్య పని పూర్తి అయిందంటూ తన లవర్కు వీడియో కాల్ చేసి చూపించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యువతి మైనర్ కావడం. 25 ఏళ్ల భర్తను అతని 17 ఏళ్ల భార్య చంపేసి ప్రియుడితో కలిసి పరార్ అయింది. డోర్-ఇచాపూర్ హైవేలోని ఐటీఐ కళాశాల సమీపంలో బాధితుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్ డెడ్ బాడీ దొరికింది. నలుగురు నిందితులు రాహుల్ ను 36 సార్లు పొడిచి పొడిచి చంపేశారు.
A man was allegedly killed by his minor wife and her lover's friend in #MadhyaPradesh's #Burhanpur. The man was stabbed to death by a bear bottle just four months after marriage.
— Hate Detector 🔍 (@HateDetectors) April 18, 2025
In Madhya Pradesh's Burhanpur, Golden Pandey alias Rahul (25) was stabbed 36 times. The incident… pic.twitter.com/eEz0YOTSSk
నాలుగు నెలల క్రితం వివాహం
బుర్హాన్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దేవేంద్ర పాటిదార్ వెల్లడించిన వివరాల ప్రకారం, నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట ద్విచక్ర వాహనంపై షాపింగ్ చేసి రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ అమ్మాయి తన చెప్పులు పడిపోయినట్లుగా నటించి తన భర్తను బైక్ ఆపమని అడిగింది. రాహుల్ బైక్ ఆపుతుండగా, ఆమె ప్రియుడైన యువరాజ్ స్నేహితులు ఇద్దరు అతన్ని అడ్డుకున్నారు. పగిలిన బీరు బాటిల్‌తో 36 సార్లు పొడిచి పొడిచి రాహుల్ ను చంపారు. దీంతో రాహుల్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం టీనేజ్ అమ్మాయి యువరాజ్ కు తన భర్త మృతదేహాన్ని చూపించడానికి వీడియో కాల్ చేసింది. ఆనంతరం నిందితులు మృతదేహాన్ని సమీపంలోని పొలంలో విసిరేసి అక్కడి నుంచి పారిపోయాడు.
ఆదివారం (ఏప్రిల్ 13)వ తేదీన పోలీసులకు రాహుల్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం, ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు రాహుల్ తో అతని భార్య కూడా ఉందని పోలీసులకు వెల్లడించారు. ఆ టీనేజ్ అమ్మాయి కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అనేక బృందాలుగా ఏర్పడి వారిని అరెస్టు చేశారు.