Atal Setu : ముంబయ్ (Mumbai) లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అటల్ సేతు నిర్మించారు. దేశంలో అత్యంత పొడవై సముద్రపు వంతన ఇది. ఈ ఏడాది జనవరిలో దీనిని ప్రారంభించారు. అయితే దీని మీద ఇప్పుడు పగుళ్ళు ఏర్పడ్డాయి. మూడు నెలల్లోనే అటల్ సేతుపై పగుళ్లు ఏర్పడ్డాయి. నవీ ముంబయి సమీపంలో అర కిలోమీటరు మేర ఇదే పరిస్థితి. దీని మీద కాంగ్రెస్ విరుచుకుపడుతోంది.
ప్రారంభించి నాలుగు నెలలు కూడా గడక ముందే అటల్ సేతు మీద పగుళ్ళు ఏర్పడ్డాన్ని కాంగ్రెస్ (Congress) రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే (Nana Patole) విమర్శించారు. వంతెన నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన...పనుల్లో నాణ్యతా లోపం కొట్టచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు అటల్ సేతు పగుళ్లు ఏర్పడిన ప్రాంతానికి మీడియాను వెంట తీసుకెళ్లారు. పగుళ్లు పరిశీలించి.. మీడియాకు చూపించారు. ఈ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కానీ, పనుల్లో అవినీతి చోటుచేసుకుందని పటోలే అన్నారు. అయితే ఈ ఆరోపణలను అధికారులు ఖండిస్తున్నారు. ప్రధాన వంతెన మీద పగుళ్ళు వచ్చాయన్నది అబద్ధమని తోసి పుచ్చారు. ఉల్వే నుంచి ముంబయి వైపు వంతెనను అనుసంధానించే అప్రోచ్ రోడ్డుపై అవి ఏర్పడ్డాయి. మరమ్మతులు చేపట్టామని తెలిపారు. మరోవైపు అటల్ సేతుపై దుష్ప్రచారం ఆపాలని బీజేపీ (BJP) మండిపడింది.
Also Read:Andhra Pradesh: 8th వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ హై కోర్టు