CPI Narayana:బిగ్ బాస్ మీద మళ్ళీ నోరుపారేసుకున్న సీపీఐ నారాయణ తెలుగు బిగ్ బాస్ షో మీద సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఏ సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉండడాన్ని ఏమంటారు అంటూ మండిపడ్డారు నారాయణ. By Manogna alamuru 21 Nov 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి సీసీఐ నారాయణ మళ్ళీ మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నారు. గతంలో తాను చేసిన వాఖ్యల్నే సమర్ధించుకుంటున్నారు. ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ వ్యాఖ్యలు చేశారు నారాయణ. అప్పట్లో అది చాలా పెద్ద గొడవే అయింది కూడా. ఇప్పుడు మళ్ళీ దాన్ని పైకి లాగారు. ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... బిగ్ బాస్ బ్రోతల్ హౌస్ అని మళ్ళీ అన్నారు. తాను ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్సీ చేయాలని భావించను అంటూనే బిగ్ బాస్ అనైతికంగా అనిపించింది అంటూ కామెంట్స్ చేశారు. అందుకే ఆ షోను అన్నిసార్లు విమర్శించానన్నారు. ఏ సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉండటాన్ని ఏమనాలి అని మండిపడ్డారు. Also Read:చాలా మందికి తెలియని నెహ్రూ ఆదివాసీ భార్య కథ ఇది. దీంతో పాటూ తెలంగాణ పాలిటిక్స్ మీద కూడా నారాయణ స్పందించారు. బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్ళతో అన్ని రోజులు కలిసి ఉంటాం. ఈ రోజుల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సాధ్యంకావడం లేదు. చట్టసభల్లో ఉండాలంటే కలిసిపోవడమే తమకు ఉత్తమం అన్నారు. సర్దుబాటు ధోరణిలోనే రాజకీయ అవగాహన ఉంటుంది అని వ్యాఖ్యానించారు. లెఫ్ట్ పార్టీల ప్రస్తుత పరిస్థితికి తాము గతంలో చేసిన తప్పులే కారణమంటూ విచారించారు. పార్టీ విడిపోకుండా ఉంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదు. కలిసి ఉందామని సీపీఐ పెడుతున్న ప్రతిపాదనకు సీపీఎం అంగీకరించడంలేదు. తమ పార్టీతో ఏం సంబంధంలేని వారికి ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంది. కోటి రూపాయలా, 10 లక్షలా అనేది నిరూపించలేను కానీ.. డబ్బులకు టికెట్లు అమ్ముకున్న మాట మాత్రం వాస్తవం అన్నారు నారాయణ. దీంతో పాటూ బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే..అది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటూ కామెంట్ చేశారు నారాయణ. Also Read:ఉత్తర గాజాలో ఇండోనేషియన్ ఆసుపత్రిని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ #cpi #comments #narayana #big-boss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి