MLC Kavitha Bail: సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఇరు పక్షాలు తమ వాదనలను కోర్టుకు వినిపించాయి. అనంతరం బెయిల్‌పై కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. వచ్చే నెల అంటే మే 2కు తీర్పను రిజర్వ్ చేసింది. అంతకు ముందు లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 22 లేదా 23న కవిత బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపడుతుందని తెలిపారు.
కేసులో ట్విస్ట్‌లు..
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులోనూ నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారాడు. అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం అందించారు. సెక్షన్ 164 కింద వాంగ్మూలాన్ని శరత్ చంద్రారెడ్డి ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు ప్రత్యేక కోర్టు జడ్జి.
ఈడీ కేసులో గతంలోనే అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి మారిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లో అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి మారాడు. ఢిల్లీ మద్యం కేసులోనే గత నెలలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరిచాక తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ఇదే కేసులో మాగుంట రాఘవ, దినేష్ అరోరా అప్రూవర్లగా మారారు.
Also Read:Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు