Kavitha: కవితకు మళ్ళీ జ్యుడీషల్ కస్టడీ..తీహార్‌కు తరలింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మళ్ళీ జుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 23 వరకు ఆమెను కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది.  నిన్నటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపర్చింది సీబీఐ.

New Update
Kavitha: కవితకు మళ్ళీ జ్యుడీషల్ కస్టడీ..తీహార్‌కు తరలింపు

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కు షాక్‌ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) ఆమెకు మళ్ళీ వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. ఈ నెల 23వరకు జ్యుడీషియల్ కస్టడీని విధిస్తూ ఆదేవాలు జారీ చేసింది. అంతకుముందు విధించిన మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఈరోజు కొంత సమయం క్రితం సీబీఐ కోర్టు(CBI Court) లో హాజరుపర్చింది. ఈ మూడ్రోజుల కస్టడీలో కవితను సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని సీబీఐ కోర్టులో చెప్పింది.  ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది.  సీబీఐ మరో 14 రోజుల కస్టడీ అడగ్గా కోర్టు మాత్రం తొమ్మిది రోజులు మాత్రమే ఇచ్చింది. మరోవైపై  కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇక నిన్న కవితను అన్న కేటీఆర్(KTR) కలిశారు. కేసు విషయంలో కాసేపు చర్చించారు. కోర్టు తీర్పు తర్వాత సీబీఐ అధికారులు కవితను మళ్ళీ తీహార్‌ జైలుకు తరలించారు.

సీబీఐ కాదు బీజేపీ...

సీబీఐ కవితను కోర్టుకు తీసుకెళ్ళే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బయట బీజేపీ వాళ్ళు అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోందన్నారు. రెండు నెలల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అడిగిందే అడుగుతున్నారు..కొత్తది ఏమీ లేదు అంటూ చెప్పారు కవిత. అయితే కవిత ఇలా మాట్లాడ్డం మీద కోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. మరోసారి ఇలా మాట్లాడొద్దంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Also Read : CM Revanth Reddy : ఆప్‌కీ ఆదాలత్‌లో ఓటర్లకు సలహా ఇచ్చిన తెలంగాణ సీఎం.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు