Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్‌.. పోలీసు కస్టడీకి పర్మిషన్

పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. మాచర్ల కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. జైల్లోనే లాయర్ సమక్షంలో విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది.

Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్‌.. పోలీసు కస్టడీకి పర్మిషన్
New Update

పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్ తగిలింది. మాచర్ల కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. జైల్లోనే లాయర్ సమక్షంలో విచారించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. మే 13న పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. అలాగే బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళతో కూడా దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు తనను చంపేయాలని పిన్నెల్లి వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారని.. టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన కేసులో రామకృష్ణారెడ్డిని పోలీసులు ఏ-1గా చేర్చారు.



Also read: కేంద్ర పదవులు ఆశించడం లేదు.. జాతీయ మీడియాతో చంద్రబాబు

#andhra-pradesh #ap-news #pinnelli-ramakrishna-reddy #telugu-news #ysrcp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe