కాంగ్రెస్ అంటేనే అవినీతి.. కిషన్ రెడ్డి ఫైర్!

కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినతికి కేర్ అఫ్ అడ్రెస్ అని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డి. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దొరికిన సొమ్మే దీనికి నిదర్శనం అని అన్నారు. రాహుల్ గాంధీకి అనుచరుడు ధీరజ్ సాహు అని ఆరోపించారు.

New Update
కాంగ్రెస్ అంటేనే అవినీతి.. కిషన్ రెడ్డి ఫైర్!

Kishan Reddy: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి, వ్యాపార సముదాయలపైన జరిగిన ఐటీ సోదాల్లో రూ. 290 కోట్ల అక్రమ సంపాదనను అధికారాలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు.

ALSO READ: టీడీపీ వల్లే HYDలో కాంగ్రెస్ ఓడింది.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద అక్రమ సంపాదన బయట పడటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు. డబ్బులు లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయి.. తప్పితే లెక్కించడం పూర్తికావడం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీపై కిషన్‌ రెడ్డి చురకలు అంటించారు.

రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయని గుర్తించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారని అన్నారు. జరిగిన సంఘటన బట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని సందేశం ఇచ్చారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికే చోటు ఉండేది అని వ్యాఖ్యానించారు. దేశాన్ని నాశనం పట్టించే పని కాంగ్రెస్ ముందేసుకుందని అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగినంత అవినీతి ఏ ప్రభుత్వంలో జరగలేదని పేర్కొన్నారు. దేశంలో అవినీతి అంతం కావాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

Advertisment
తాజా కథనాలు