Telangana: వరంగల్‌ వెస్ట్‌లో బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌

వరంగల్ వెస్ట్ రాజకీయం మరింత వెడెక్కబోతుంది. కార్పొరేటర్‌ అభినవ్‌ భాస్కర్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తనకు విలువ లేనిచోట ఉండలేనన్నారు. పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వార్ మొదలైందంటున్నారు విశ్లేషకులు.

New Update
Telangana: వరంగల్‌ వెస్ట్‌లో బాబాయ్‌ వర్సెస్‌ అబ్బాయ్‌

Warangal: వరంగల్‌ వెస్ట్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌.. తన సోదరుడు, దివంగత ప్రణయ్‌ భాస్కర్‌ కొడుకు బీఆర్ఎస్‌కు కార్పొరేటర్‌ అభినవ్‌ భాస్కర్‌ (Bhasker) మధ్య పొలిటికల్ వార్ నడవబోతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ వారసత్వం..
ఇటీవలే అమెరికానుంచి తిరిగొచ్చిన అభినవ్ తన రాజకీయ వారసత్వం కోసం ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే కార్పొరేటర్‌గా గెలిచిన అభినవ్‌ ఈసారి ఏకంగా తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ కావాలని పట్టుపట్టిన విషయం తెలిసిందే. కాగా తనకు అవకాశం దక్కకపోవడంతో వినయ్‌భాస్కర్‌ ఓటమికి అభినవ్‌ సహకరించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అభినవ్.. తాజాగా కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేశాడు.

ఇది కూడా చదవండి: Crime: స్కూల్ సెలవుకోసం 1వ తరగతి బాలుడిని చంపిన విద్యార్థి

పోతేపోనీ..
దీంతో పార్టీ మార్పు ప్రకటనను అసలే పట్టించుకోకుండా పోతేపోనీ అన్నట్టుగా ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. స్థానికంగా అన్న కొడుకుని బుజ్జగించకుండా విషయాన్ని నేరుగా కేటీఆర్‌ చెవిన వేయడంతో.. ఆయన కూడా అభినవ్‌ చర్యలను అడ్డుకోవద్దని, ఏం జరిగితే అది జరుగుతుందని అన్నట్లుగా సమాచారం. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేయగా తాజాగా అభినవ భాస్కర్ కమల తీర్థానికి రెడీ అయ్యారు. పార్టీ మారడానికి నిర్ణయించుకున్న అభినవ్‌ బాబాయిపై ధిక్కార స్వరం వినిపంచడానికి ఆత్మీయ సమ్మేళనాన్ని వేదికగా చేసుకున్నారు.

ఆత్మగౌరవం లేదంటూ..
ఇటీవల హన్మకొండలోని ఒక ఫంక్షన్ హాలులో ప్రణయన్న ఆత్మీయుల సమావేశం పేరిట ఒక కార్యక్రమం నిర్వహించిన అభినవ్‌ భాస్కర్‌.. ఆత్మగౌరవం లేనిచోట వుండలేనని, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను పరకాల నుండి పోటీ చేయమని కోరినా, కుటుంబంలో ఐక్యత కోసం పట్టించుకోలేదని, ఇక మీదట ఆత్మగౌరవం లేని చోట వుండే ప్రసక్తే లేదని అన్నారు అభినవ్‌.  త్వరలో అభినవ్ భాస్కర్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. అయితే బాబాయ్‌ బీఆర్‌ఎస్‌లో, అబ్బాయ్‌ బీజేపీలో ఉంటే రాబోయే రోజుల్లో వరంగల్‌ వెస్ట్‌ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు