తెలంగాణలో కరోనా స్వైరవిహారం.. 24గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయంటే

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 9, కరీంనగర్‌లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఐసోలేషన్‌లో 55మంది ఉన్నారని, అయితే కొత్త వేరియంట్ జేఎన్‌ 1 సోకిన కేసులు రాష్ట్రంలో ఇంకా నమోదు కాలేదని డాక్టర్లు చెబుతున్నారు.

తెలంగాణలో కరోనా స్వైరవిహారం.. 24గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయంటే
New Update

Telangana : కరోనా(Corona) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో పురుడు పోసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటుండగా గడిచిన 24 గంటల్లోనే భారీగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టణాల్లోనే భారీ కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఈ మేరకు గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌(Hyderabad) లో 9, కరీంనగర్‌(Karimnagar) లో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఐసోలేషన్‌లో 55మంది ఉన్నారని, అయితే కొత్త వేరియంట్ జేఎన్‌ 1 సోకిన కేసులు రాష్ట్రంలో ఇంకా నమోదు కాలేదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక న్యూఇయర్‌, సంక్రాంతి వేళ కేసులు మరింత పెరుగే అవకాశం ఉందని, కావున్న ప్రజలు వీలైనంత వరకూ జాగ్రత్తలు పాటించాలని, పబ్లిక్ లో ఉన్నపుడు మాస్క్ తప్పనిసరి పెట్టుకోవాలని కోరారు.

ఇది  కూడా చదవండి : స్కూల్లో స్నేహితుడి మెడ కోసిన 1వ తరగతి విద్యార్థి

ఇక తెలగాణలో 989 మందికి కరోనా టెస్టులు చేయించగా.. తెలంగాణ(Telangana) లో రెండు జేఎన్‌-1 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం విశేషం. కాగా వీరిలో కొందరు జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ తేలింది. వీరి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచారు. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్‌-వేరియంట్‌ ‘జేఎన్‌.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4 కేసులు గుర్తించారు.

ఇక ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 29 యాక్టివ్ కేసులున్నాయని, గడిచిన 24గంటల్లో 5 కోత్త కేసులు నమోదైనట్లు వైద్య బృందం వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా(Vizag) లోనే ఎక్కువ కేసులు నమోదవగా శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఒకరు ఇద్దరు కరోనా బారిన పడ్టట్లు తెలిపారు.

#ap #telangana #hyderabad #corona #vizag #karimnagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe