AICTE : ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏటా స్కాలర్‌షిప్ ఇంజినీరింగ్, డిప్లోమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి AICTE శుభవార్త తెలిపింది. ఈ బ్రాంచీల్లో చేరే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. By B Aravind 06 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Scholarship From This Academic Year : ఇంజినీరింగ్ (Engineering), డిప్లొమా (Diploma) లో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) శుభవార్త తెలిపింది. ఈ బ్రాంచీల్లో చేరే విద్యార్థులకు స్కాలర్‌షిప్ (Scholarship) ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ఏఐసీటీఈ. ప్రస్తుతం ఇంజినీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లుగా మారిపోయింది. దీంతో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీల్లో చేరేందుకు ఎక్కువగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే వారిని ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి స్కాలర్‌షిప్స్ అందజేయనుంది. ఇందుకోసం ఇంటర్, తత్సమాన పరీక్షలల్లో వచ్చిన మార్కులను కొలమానంగా తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేయనుంది. Also Read: ఢిల్లీలో రూ.1,943 కోట్ల మరో భారీ స్కామ్.. మళ్లీ తెలంగాణ నుంచే నిందితులు! యంగ్ ఎచీవర్స్ స్కార్‌షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ (యశస్వి) పేరిట.. ఏఐసీటీఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం బీటెక్ సీట్లలో 60 శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇది 75 శాతం వరకూ ఉంది. కోర్ బ్రాంచీల్లో ఒక్క ఈసీఈ (ECE)లో మాత్రమే 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. తెలంగాణలో గత ఏడాది మెకానికల్, సివిల్ ఎలక్ట్రికల్ బ్లాంచీల్లో సగటున 40 శాతం మాత్రమే సీట్లు నిండాయి. ఓవైపు కేంద్రం.. మేక్ ఇన్ ఇండియా పేరిట మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా దేశాన్ని మార్చాలని భావిస్తుంటే.. మరోవైపు విద్యార్థులు మాత్రం ఎక్కువగా సాఫ్ట్‌వేర్ వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని టాప్ కళాశాలలు కూడా కోర్ బ్రాంచీల్లో మేనెజ్‌మెంట్ కోటా సీట్లను కన్వీనర్ కోటా ఫీజుకే ఇస్తామని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను మార్చాలని.. కోర్ ఇంజినీరింగ్‌లో కూడా ప్రతిభావంతుల్ని చేర్చాలనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఎంపికైన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున ఇవ్వనున్నారు. నేషనల్ ఇ-స్కాలర్‌షప్ పోర్టల్ (NSP)లో దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో చేరినవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల కోటాను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్ విభాగంలో తెలంగాణలో 71 మంది , ఏపీలో 150 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ రానుంది. డిప్లొమాకు సంబంధించి తెలంగాణలో 52 మంది, ఏపీలో 115 మందికి స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు.మరోవైపు తెలంగాణ సర్కార్..మిగిలిన బ్రాంచీల్లో విద్యార్థుల కంటే కోర్ బ్రాంచీల్లో చేరే విద్యార్థలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఎక్కువగా ఇవ్వాలని భావిస్తోంది. కానీ దీనికి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. Also Read: గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్.. #telugu-news #national-news #engineering #aicte #diploma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి