Dharani Portal: ధరణి పోర్టల్‌పై మీ వైఖరేంటి? కాంగ్రెస్‌ ను ప్రశ్నించిన హైకోర్టు

'ధరణి'పోర్టల్ ను కొనసాగించే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏలకు ఆదేశాలు జారీ చేసింది.

Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
New Update

Dharani Portal: బీఆర్ఎస్ (BRS) పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన 'ధరణి'పోర్టల్ ను కొనసాగించే విషయంలో కాంగ్రెస్ (Congress) పార్టీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర హైకోర్టు (Telangana High Court)  వివరణ కోరింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘ధరణి’ని కొనసాగిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ముందున్న పిటిషన్‌లను పరిష్కరిస్తామని చెప్పింది. దీనిపై నూతన అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డిని వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సీసీఎల్‌ఏలకు ఆదేశాలు జారీ..
ఇక సంబంధించిన అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్‌ఏలకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఈ ఆదేశాల అమలుపై నివేదిక నిమిత్తం శుక్రవారం న్యాయమూర్తి మరోసారి విచారణ చేపట్టారు. సమస్యల పరిష్కారంలో మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేసినట్లుగా ఎలాంటి నివేదిక అందలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను (Dharani Portal) కొనసాగిస్తుందో లేదో చెప్పాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను న్యాయమూర్తి అడిగారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా ఎఫ్‌-లైన్‌ దరఖాస్తులను తిరస్కరించారు. ఇందుకు పరిమితులు విధించలేదు. ఇతర విధానాల్లో దరఖాస్తులు వచ్చినపుడు, రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై అప్పీళ్లకు, రివిజన్‌ నిమిత్తం నిబంధనలు లేవు. వీటన్నింటితోపాటు గ్రామ, మండల స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సాధారణ ఇబ్బందులపై అభిప్రాయాలను కలెక్టర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరించాలని సీసీఎల్‌ఏకు గత ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీచేశారు. దీనిపై ఏజీ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ధరణి కొనసాగింపునకు సంబంధించి నిర్ణయం చెప్పడానికి 4 వారాల గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి : Prajapalana: ఆరు గ్యారంటీల దరఖాస్తుకు గడువు పొడిగింపు?

ధరణిపై పిటిషన్..
హైదరాబాద్‌కు చెందిన వై.జైహింద్‌రెడ్డితో పాటు మరికొందరు ధరణిలో ఎదురవుతున్న సమస్యలపై పిటిషన్‌లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో వివిధ సర్వే నంబర్లలోని 146.05 ఎకరాలకు చెందిన వివిధ విక్రయ దస్తావేజుల సర్టిఫైడ్‌ కాపీలను గండిపేట తహసీల్దారు ఇవ్వకపోవడాన్ని సవాలు చేశారు. కాగా దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గత ఏడాది ఏప్రిల్‌లో విచారణ చేపట్టడంతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ)ను కోర్టుకు పిలిపించి పలు సందేహాలపై వివరణ కోరారు. కోర్టుకు వస్తున్న పిటిషన్‌ల ఆధారంగా ధరణిలో 20 దాకా ప్రధాన సమస్యలున్నాయని గుర్తించారు.
నిర్దిష్ట గడువులోగా ఈ-పట్టాదారు పాస్‌బుక్‌లో సవరణకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించకపోవడం, సర్వే నిమిత్తం ఎఫ్‌-లైన్‌ దరఖాస్తులను తీసుకోకపోవడం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన ఆస్తులకు విక్రయ దస్తావేజులను జారీ చేయకపోవడం, ధరణి పోర్టల్‌లో ఉన్న జీపీఏలను రిజిస్ట్రేషన్‌ సమయంలో పట్టించుకోకపోవడం వంటి సమస్యలున్నట్లు న్యాయస్థానం గుర్తించినట్లు పేర్కొంది.

#congress #telangana #high-court #dharani-portal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe