పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహాం చేసకుంటారు. సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లలో.. ఆస్తి, అంతస్తులను పక్కన బెట్టి, వయసుతో కూడా సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. మరికొందరైతే వికలాంగులను కూడా వివాహాలు చేసుకుంటారు. అయితే తాజాగా అమెరికాలోని అవిభక్త కవలలైన (Conjoined Twins) అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సస్పెండ్
ఆర్మీ రిటైర్ట్ ఆఫీసర్‌తో
అమెరికా ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ జోష్ బౌలింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో.. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో కనిపించింది. అందులో ఈ అవిభక్త కవలలు పెళ్లి దూస్తుల్లో.. జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడం చూడొచ్చు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్‌బుక్ పేజీలో కూడా ఆయన.. ఈ కవలలు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు ఉన్నాయి.
పాఠాలు బోధిస్తున్న కవలలు
అంతేకాదు వీళ్ల పెళ్లికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ కూడా బయటపడింది. ఇందులో వారు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇదిలాఉండగా.. 1996లో 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' లో ఈ ఇద్దరు అవిభక్త కవలలు కనిపించి వార్తల్లో నిలిచారు. మిన్నెసోటాలో నివసిస్తున్న ఈ కవల అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అయితే అబ్బి, బ్రిట్ని శరీరం కలిసిపోయి ఉంటుంది. అబ్బి కుడి చేయి, కుడి కాలును నియత్రిస్తుంది. మరోవైపు బ్రిట్ని ఎడమ చేయి, ఎడమ కాలను నియంత్రిస్తుంది.
Also Read: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు