National: ఫ్లైట్ టికెట్ కొనలేం.. ట్రైన్ లో కూడా వెళ్లలేం: మోదీపై రాహుల్ ధ్వజం

మా అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇప్పుడు నడిరోడ్డు మీద నిలబడ్డామని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అకౌంట్లు సీజ్ చేయడంతో కనీసం రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామన్నారు.ఎన్నికల ప్రచారానికి రైల్లో కూడా వెళ్ళలేని పరిస్థితని వివరించారు.

New Update
National: ఫ్లైట్ టికెట్ కొనలేం.. ట్రైన్ లో కూడా వెళ్లలేం: మోదీపై రాహుల్ ధ్వజం

Rahul Gandhi on Electoral bonds:  కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్‌ చేయడం దారుణమని రాహుల్‌ మండిపడ్డారు. పెద్ద పెద్ద విషయాలను వదిలేయండి..కనీసం తాము తమ అకౌంట్ నుంచి రెండు రూపాలయను కూడా ఖర్చు పెట్టలేకుండా చేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.  అక్రమంగా కాంగ్రెస్‌ అకౌంట్స్‌ను ఫ్రీజ్‌ చేశారు. రాజ్యాంగ సంస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. నిజానికి ఇది మా ఖాతాలను సీజ్ చేయడం కాదు...ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేయడం అని రాహుల్ ఆరోపించారు.  తమపై క్రిమినల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నారు...కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఈడీ దీని మీద స్పందించడంలేదని ఆరోపించారు.

నెల క్రితమే సీజ్ చేశారు..

కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను నెల రోజుల క్రితమే సీజ్ చేసేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి..  దేశంలోని 20% ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు...కానీ ఈ రోజు మేము రైల్వే టిక్కెట్లు కొనలేని.. ప్రకటనలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్‌పై...ప్రధాని కావాలని కుట్ర చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ ప్రచారంలో కాంగ్రెస్ తరుపు నుంచి ఒక్క యాడ్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఎలక్షన్ కమీషన్ కనీసం దీని గురించి పట్టించుకోవడం లేదు. మీడియా కూడా మా సమస్య అర్ధం చేసుకోవడం లేదు. వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

మమ్మల్ని అన్ని రకాలుగా బంధించేశారు..

ఈ అకౌంట్ల సీజింగ్ సమస్య ఒక కుటంబానికి వస్తే...ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. అదే ఒక వ్యాపారసంస్థకు వస్తే...వాళ్ళు వ్యాపారాన్ని మూసేసుకోవాలి. ఇప్పుడు మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని వివరించారు రాహుల్ గాంధీ. తాము కనీసం ఎన్నికల ప్రచారానికి రైల్లో కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. 14 లక్షలకు సంబంధించిన ఎప్పటిదో 90ల్లో కేసుకు ఇప్పుడు మా బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. ఇది ఎంత వరకు న్యాయమని రాహుల్ వాపోయారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు...

ఎలక్టోరల్ బాండ్స్ మీద కాంగ్రెస్ పెద్దలు ఈరోజు ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టారు. ఇందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్ మరికొందరు నేతలు పాల్గొన్నారు.  ఇందులో మొదటగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే మాట్లాడుతూ..ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అన్నారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్‌ బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేశారు...నిష్పక్షపాత ఎన్నికలు ఎక్కడా జరగడం లేదని ఆరోపించారు ఖర్గే.

బీజేపీకి ఏ ఏ కంపెనీలు విరాళాలిచ్చాయో త్వరలోనే తెలుస్తుంది..బీజేపీకి 56 శాతం ఎన్నికలు బాండ్ల రూపంలో వచ్చాయి. ఈ విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. కాంగ్రెస్‌కు 11శాతం మాత్రమే ఎలక్టోరల్‌ బాండ్స్‌ వచ్చాయి. అయినా కేంద్రం దాన్ని పెద్ద ఇష్యూ చేస్తోందని ఖర్గే ఆరోపించారు. రాజకీయపార్టీలు ఐటీ పరిధిలోకి రావని..
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడిన సమాచారంపై విచారణ జరగాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు.

బీజేపీ కుట్ర చేస్తోంది..
మా అకౌంట్లను ప్రభుత్వం సీజ్‌ చేసిందని...కేంద్ర తీరు ఏ మాత్రం బాగాలేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ.  ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఈ రకమైన కేంద్ర వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సోనియా గాంధీ. కాంగ్రెస్‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది ఆరోపించారు. తక్షణమే కాంగ్రెస్‌ అకౌంట్లపై ఫ్రీజ్‌ తొలగించాలని సోనియా డిమాండ్ చేశారు.

Also Read:పిల్లలను చంపి రక్తం తాగిన కేసులో రెండో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు