Murder Mystery : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) చిన్న పిల్లల హత్య కేసు(Kids Murder Case) లో పోలీసులు పురోగతి సాధించారు. ఇందులో నిందితుడిగా ఉన్న రెండో వ్యక్తిని ఈరోజు బదౌన్(Budaun) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని బరేలీలో అరెస్ట్ చేశామని పోలీసులుచెబుతున్నారు. హత్యలు చేసిన తర్వాత జావేద్ మొదట ఢిల్లీ పారిపోయాడు. అక్కడి నుంచి బరేలీ వచ్చాడు. జావేద్(Javed) హత్య జరిగిన తరువాత తన ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. ఇతని మీద పోలీసులు 25వేల రివార్డును కూడా ప్రకటించారు.
అయితే తాను బరేలికి కావాలనే వచ్చానని నిందితుడు జావేద్ చెబుతున్నాడు. మొదట తాను ఢిల్లీ(Delhi) పారిపోయాయనని..కానీ తన అన్నయ్య సాజిద్ ఏం చేశాడో చెబుతూ తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని...అందుకే తాను పోలీసులకు లొంగిపోవడానికి బరేలీ వచ్చేశానని జావేద్ చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది.
#WATCH | Budaun Double Murder Case | Second accused in the matter, Javed arrested by Police from Bareilly (Uttar Pradesh) last night.
In a video, sourced to Police, he is heard saying, "...I ran straight to Delhi and from there I have to come to Bareilly to surrender. I have… pic.twitter.com/zIPcXZ0bwy
— ANI (@ANI) March 21, 2024
అసలేం జరిగిందంటే...
ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో బార్బర్ షాప్(Barber Shop) నిర్వహిస్తున్న సాజిద్(Sajid) అనే వ్యక్తి ఉదయం 8 గంటల ప్రాంతంలో తన షాపు ముందు ఉన్న వినోద్(Vinod) అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. వీరిద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందని, వారి మధ్య పాత గొడవలు జరుగుతున్నాయని సమాచారం. వినోద్ ఇంటికి వెళ్లిన సాజిద్ ముందుగా వినోద్ భార్యని టీ చేయమని అడిగాడు.తర్వాత టెర్రస్‌పైకి వెళ్లి వినోద్ ముగ్గురు పిల్లలు ఆయుష్, అహాన్, పీయూష్‌లపై బ్లేడ్(Blade) తో దాడి చేశాడు. ఇందులో ఆయుష్(14), హనీ (6) వీరిద్దరి మెడను బ్లేడ్‌తో కోశాడు. ఆతర్వాత వారి రక్తాన్ని కూడా తాగాడు. ఈ దాడిలో ఆయుష్ , హనీ అక్కడిక్కడే మరణించారు. వీళ్ళ తర్వాత మూడో పిల్లాడు పీయూష్ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు సాజిద్, జావేద్‌లు. అయితే పియూష్ ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కిందకు వెళ్ళి కేకలు వేయడంతో వెంటనే జనం పోగయ్యారు. ఈ తప్పించుకోవడంలో పియూష్‌కు స్వల్ప గాయాలు కావడంతో.. అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వెంటనే పారిపోయిన నిందితులు..
ఇద్దరు చిన్నారులను హత్య(Murder) చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే విషయం తెలిసిన వెంటనే పోలీసులు వారికోసం గాలించారు. ఇందులో భాగంగా నిందితులను పోలీసులు పట్టుకోబోతే వారి మీద దాడికి ప్రయత్నించాడు సాజిద్. దీంతో సాజిద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్(Encounter) లో హతమార్చారు. హత్యలో పాల్గొన్న జావేద్ పోలీసులకు చిక్కలేదు. మృతుల తల్లి చెప్పిన ఆధారాల ప్రకారం జావేద్ కూడా హత్యలో పాల్గొన్నాడు.
చెలరేగిన అల్లర్లు…
బదౌన్ లో ఈ దారుణ హత్యాకాండతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చనిపోయిన పిల్లలు ఇద్దరూ హిందువులు కావడం…నిందితులు ముస్లిం యువకులు కావడంతో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. వీటిని అదులో ఉంచేందుకు ఏడీజీ బరేలీ, ఐజీ రాకేష్ సింగ్ ఘటనా స్థలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చిన్నారులను మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించారు.
Also Read : National: కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణం-రాహుల్ గాంధీ