National : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్‌. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్‌ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది.

National : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ
New Update

Rahul Gandhi : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్షానికి నాయకత్వం వహించనున్నారు రాహుల్‌ గాంధీ. ఈ మేరకు కూటమి నిర్ణయాన్ని సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రకటించారు. ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మెహతాబ్‌కు లేఖ ద్వారా పంపినట్లు కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్‌ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది. 2014లో 42, 2019లో 55 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.

అంతకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇంట్లో ఇండియా కూటమి నేతలంతా సమావేశమయ్యారు. ఇందులో రాహుల్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడంతో పాటూ స్పీకర్ ఎన్నిక మీద కూడా చర్చించారు.

మరోవైపు స్పీకర్ ఎన్నిక మీద లోక్‌సభలో రగడ జరుగుతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. లోక్‌సభ స్పీకర్‌ కోసం చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఎన్నిక జరిగింది. 1952, 1976 ఎమర్జెన్సీ టైంలో లోక్‌సభ స్పీకర్‌ కోసం ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి కూడా ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేసింది. అయితే.. డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇస్తేనే స్పీకర్‌కు మద్దతిస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. ఈ కండిషన్ కు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ఇండియా కూటమి సురేష్ కొడికున్నిల్ ను స్పీకర్ అభ్యర్థిగా బరిలోకి దించింది. తాజా మాజీ స్పీకర్ ఓంబిర్లాను ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది.

ఈ నేపథ్యంలో ఇండియా కూటమి (India Alliance) నేతలందరినీ ఒక మాటకు మీదకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ బాధ్యతను తన భుజాల మీదన వేసుకున్నారు. దాంతో ఆయనను ప్రతిపక్ష నేతగా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. రాహుల్‌ గాంధీ ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్‌ నుంచి కూడా గెలుపొందినప్పటికీ.. తాజాగా ఆ స్థానానికి రాజీనామా చేశారు.

Also Read:Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్ష ప్రాశస్త్యం ఏంటి? పవన్ ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు?

#lok-sabha #mallikarjun-kharge #parliament #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe