BRS MLA : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) భూవివాదం (Land Dispute) కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నిరోజులు దౌర్జన్యాలు చేశారు. మల్లారెడ్డి అరచకాలు ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) దృష్టికి తీసుకెళ్తాం. సుచిత్రలో సర్వే నెంబర్ 83/Eలో 600 గజాల ల్యాండ్‌ను 2015లో నేను కొనుగోలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో పాటు.. మిగతా బీఆర్‌ఎస్ నేతలు నాతోపాటే ల్యాండ్ కొన్నారు. 2021లో ఈ భూమిని శ్రీనివాస్ రెడ్డికి అమ్మేశాం.
Also read: మిర్యాలగూడలో ఈటల స్పీచ్-LIVE
మేము కొన్న భూమి డాక్యుమెంట్లు మల్లారెడ్డి ఫేక్ అంటున్నాడు. ల్యాండ్ వివాదం పరిష్కరించమని.. అనేకసార్లు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని అడిగాను. ఇందులో వాళ్ల ల్యాండ్ లేనప్పటికీ దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని' అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మరోవైపు ఈ భూ వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ అటువైపు వెళ్లకుండా అనుమతించడం లేదు. మీడియాకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ల్యాండ్ సర్వేతో వివాదం కొలిక్కి రానుంది.
Also read: అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు