Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు?

అక్టోబర్-నవంబర్ నెలల్లో మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ చివరిది. దీంతో అది అయిన వెంటనే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారు. మధ్యప్రదేశ్ లో టఫ్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

New Update
Exit polls: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు?

మధ్యప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ ఇంట్రసింగ్ గా మారాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోటీ ఉంటుందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌దే పై చెయ్యి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అక్కడ ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ , సమాజ్‌వాదీ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ , గోండ్వానా గణతంత్ర పార్టీ సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి.

కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 114 సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 125 వరకూ పెరిగే అవకాశముంది. బీజేపీ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 109 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి 9 స్థానాలు తగ్గిపోయి 100 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుంది. మొత్తంగా చూస్తే...230 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో బఘేల్‌ఖండ్, భోపాల్, చంబల్, మహాకౌశల్, మల్వా, నిమర్ ప్రాంతాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. బఘేల్‌ఖండ్‌లో 56 నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ నిరుద్యోగ అంశం, ద్రవ్యోల్బణం, అవినీతి అంశాలు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మీద అక్కడ అసహనం వ్యక్తం చేసేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈసారి కాంగ్రెస్ ను గెలిపించాలనుకుంటున్నారని సర్వేల్లో తెలింది. అయితే  ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి సానుకూల ఓట్లు పడితే కాంగ్రెస్‌పై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. అప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ కన్నా కొంచెం ఆధిక్యం సంపాదించే అవకాశం ఉండొచ్చు. అయితే బీజేపీ గెలిచాన పెద్ద తేడా మాత్రం రాదు. 10 నుంచి 20 స్థానాల తేడాతోనే గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

పీపుల్స్ పల్స్ సర్వే
కాంగ్రెస్-117 నుంచి 139
బీజేపీ -91 నుంచి 113
ఇతరులు- 0 నుంచి 8

ఇండియా టూడే సర్వే
బీజేపీ- 106 నుంచి 116
కాంగ్రెస్ - 111 నుంచి 121

న్యూస్ 18 సర‍్వే
బీజేపీ -112
కాంగ్రెస్- 113
ఇతరులు- 5

సీఎన్‌ఎన్‌ సర్వే
బీజేపీ-116
కాంగ్రెస్-111
ఇతరులు-3

జన్ కీ బాత్ సర్వే
బీజేపీ- 100-123
కాంగ్రెస్- 102-125
ఇతరులు- 05

రిపబ్లిక్ టీవీ-Matrize
బీజేపీ- 118-130
కాంగ్రెస్- 97-107
ఇతరులు-0-2

పోల్ స్టార్ట్
బీజేపీ- 106-116
కాంగ్రెస్- 111-121
ఇతరులు- 0-6

అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనాలు మాత్రమే. ఇవి తారుమారు అయ్యే ఛాన్స్ లు కూడా ఉంటాయి. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగితే ఒకలా...ఇంకో సర్వే ఏజెన్సీ అడిగితే ఇంకోలా చెప్పవచ్చును. అసలు ఫలితాలు తేలిది మాత్రం ఓట్ల లెక్కింపు రోజునే. ఐదు రాష్ట్రాల పోలింగ్ వేరు వేరు రోజుల్లో జరిగినా..ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజున జరుగుతుంది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 3 న ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలిపోతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు