Medchal: వాళ్లంతా ఆయన మోచేతి నీళ్లు తాగి పైకొచ్చారు.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ నాయకులకు పాలన అనుభవం లేక తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో ఒకరు చంద్రబాబు తొత్తుగా ఉంటే మరికొందరు రాజశేఖర్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ పైకొచ్చిన వాళ్లే ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Medchal: వాళ్లంతా ఆయన మోచేతి నీళ్లు తాగి పైకొచ్చారు.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
New Update

Jagadishwar Reddy: కాంగ్రెస్ నాయకులకు పాలన అనుభవం లేక రాష్ట్రం ఆగమాగం అవుతోందని బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మూడు చింతలపల్లి మండలాల, తూంకుంట పురపాలక సంఘం బీఆర్ఎస్ విజయోత్సవ సభను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Malla reddy) ఆధ్వర్యంలో అలియాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఉంటే వీరి ఆటలు సాగవని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇతర పార్టీలతో కుమ్మక్కై కేసీఆర్ ను అణగదొక్కాలని కుట్ర చేసిందన్నారు. మంత్రివర్గంలోని ఏ ఒక్కరికి కూడా ఆయా శాఖలపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

This browser does not support the video element.

మోచేతి నీళ్లు తాగుతూ..

అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒకరు చంద్రబాబు తొత్తుగా ఉంటే మరి కొందరు రాజశేఖర్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ పైకొచ్చిన వాళ్లే ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుండగా కావాలని కుట్రపూరితంగా ప్రజల్లోకి బీఆర్ఎస్ పై అబద్ధాలు నూరిపోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ఆదాయ వనరుల కోసం వెతుకుతున్నారని, ప్రజలకు ఏమీ చేయాలనే ఆలోచన లేదన్నారు. ఆదాయవనరులు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని విమర్శించారు.

ఇది కూడా చదవండి : Divya Deshmukh: నన్ను ఒక సెక్సిస్ట్ గా చూశారు.. భారత చెస్‌ ప్లేయర్‌

అబద్ధపు ప్రచారాలు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొడతాడని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నవాళ్లంతా ఎవరి దారి వారిదే అన్న విధంగా ఉన్నారని. తమ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ఏ అధికారి చొరవలేకుండానే నేరుగా చేరిందని తెలిపారు. కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలులో లేవని, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల తరపున పోరాటం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శామీర్ పేట్ మూడు చింతలపల్లి, తూంకుంట పురపాలక ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

#medchal #congress #jagadishwar-reddy #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe