Rahul Gandhi : నేను చెప్పింది.. నిజామాబాద్ సభలో మోదీ అంగీకరించారు..!!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందరూ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను చెప్పిందే నిజమైందన్నారు. తాను చెప్పింది...మోదీ అంగీకరించారు అంటూ రాహుల్ గాంధీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేంటో చూద్దాం.

New Update
Rahul Gandhi: ఉపాధి హమీ కూలీలు, కౌలు రైతులకు రాహుల్ ఆఫర్..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు గిరిరాజ్ కళాశాలలో బీజేపీ ఏర్పాటు చేసిన జనగర్జన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నిజామాబాద్ సభలో తాను గతంలో ఏదైతే చెప్పానో...ప్రధాని మోదీ అంగీకరించినట్లు అయిందన్నారు రాహుల్ గాంధీ.

బీఆర్ఎస్, బీజేపీ భాగస్వామ్యం తెలంగాణను నాశనం చేసిందంటూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలను కాదని..కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి:సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లుంది.. ప్రధాని మోదీపై విరుచుకుపడిన హరీష్ రావు..

publive-image

నేను గతంలో చెప్పిందే నిజం అయ్యింది. నిజామాబాద్ సభలో ఈ విషయాన్ని మోదీ అంగీకరించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి. బీఆర్ఎస్, బీజేపీ భాగస్వామ్యం 10ఏళ్లలో తెలంగాణను సర్వనాశనం చేసింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీని గమనిస్తూనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: ‘అభి పిక్చర్ బాకీ హై’.. ఇందూరు సభా వేదికగా రెచ్చిపోయిన బీజేపీ ఎంపీ అరవింద్..

ప్రజలు చాలా తెలివైనవారు. తెలంగాణలో రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో ఆరు హమీలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా.. అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు