IPS Viral Tweet : అదంతా అమ్మ అనుగ్రహం వల్లే జరిగింది...ఐపీఎస్ అధికారి ట్వీట్ వైరల్..!!
నవరాత్రి సందర్భంగా ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి, నవరాత్రి సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఫాస్టింగ్ ఫుడ్ ఎలా వచ్చిందో అధికారి చెప్పారు. అదంతా అమ్మ అనుగ్రహం వల్లే జరిగిందని ట్వీట్లో చెప్పుకొచ్చారు. తాను ఫాస్టింగ్ ఫుడ్ లేకుండా ఉపవాసం ఉండాల్సి వస్తుందనుకున్నాను. కానీ ఫ్లైట్ లో ఫాస్టింగ్ ఫుడ్ ఇవ్వడం చూసి తాను షాక్ అయ్యాను అని చెప్పారు. ఫుడ్ ప్లేట్ ఫొటోను షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది.