ఈనెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత లేఖ పంపడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశంపై స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు సిద్దాంతాలు లేను పార్టీలంటూ విమర్శించారు. ఆ రెండు పార్టీలు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులర్ అనే మాటకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
Also read: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ఎవరంటే..
ఓట్లు చీల్చడం కోసమే
కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజీపీలో విలువ లేదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చి.. కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కవితను అరెస్టు చేస్తే సానుభూతి వచ్చి.. ఓట్లు డైవర్ట్ అవుతాయని వాళ్ల లెక్క అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేదే వాళ్ల ఆలోచన అంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని కవిత తేల్చి చెప్పారు. ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు.
తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏదైన సమాచారం కావాలంటే వర్చువల్ విధానంలో హాజరవుతానని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదంటూ పేర్కొన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని.. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టుకు వెళ్లానని.. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని.. గతంలో కూడా సీబీఐ హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించినట్లు చెప్పారు. కానీ.. 15 నెలల విరామం తర్వాత విచారణకు పిలవడం, సెక్షన్ల మార్పు వంటివి అనేక అనుమానాలకు తావునిస్తోందని ఆరోపిస్తున్నారు.
Also Read: మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్..మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!