Smitha Sabarwal: పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణి నకిలీ వైకల్యం సర్టిఫికెట్ తో సివిల్స్ సర్వీస్ ఉద్యోగంలో ప్రవేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలంటూనే ఆల్ ఇండియా సర్వీసులలో వారికి కోటా ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఎక్స్ వేదికగా ఆమె చేసిన వరుస ట్వీట్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిన ఉద్యోగాల్లో కోటా ఎందుకని డెస్క్ లో పని చేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని సూచించారు.
దీనిపై చాలామంది స్పందిస్తున్నారు. స్మిత చేసిన వ్యాఖ్యలు సైనవి కావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులను ఆమె కించపరిచారని మండిపడుతున్నారు. తాజాగా దేశంలోని కోట్లాదిమంది దివ్యాంగుల మనోభావాలను, భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగపరిచే విధంగా ప్రవర్తించారంటూ స్మితా సబర్వాల్ పై కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్మిత సబర్వాల్ మిగతా క్యాడర్ అధికారులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read:Bigg Boss: బిగ్‌బాస్ షోను ఆపండి..వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు