ఎమ్మెల్సీ కవితపై.. సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. జ్యోతీ రావు పూలే విగ్రహం పెట్టాలని కవిత చేసిన డిమాండ్‌పై ఆయన స్పందించారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. పదేళ్లలో అధికారంలో ఉండి ఏం చేశావంటూ ధ్వజమెత్తారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా అంటూ ప్రశ్నలు సంధించారు.
Also read: మాకు కూడా నోరు ఉంది.. చూస్కో రేవంత్.. కేటీఆర్ ఫైర్!
రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేశారు
'కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది. ఆ పార్టీని విమర్శించకండి. ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్‌ను చంపేశారు. ఇప్పుడు ఆయన పేరు మీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తానంటుంది. జానారెడ్డి తప్పుకుని కొడుకుకి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా ?. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసి.. మీరు అక్రమ సంపాదన చేయలేదా ?' అంటూ బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు
' బీసీల కోసం మీ త్యాగం అవసరం లేదు. మీరు ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. మీ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తే.. కొండా లక్ష్మణ్ బాపూజీని మీరు పట్టించుకున్నారా ?.. ముఖ్యమంత్రి కావాలని మీరు.. కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాకపోవడంతో.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శిస్తున్నారు. ముందు మీరు లిక్కర్ స్కాం నుంచి బయటపడండి. విశ్రాంతి తీసుకోండి.. ఏం తప్పు చేశారో తెలుసుకోండి. ప్రెస్ మీట్లు పెట్టడం ఆపండి.. ప్రజలు అసహ్యించుకుంటున్నారు' బండ్ల గణేష్ మండిపడ్డారు.
అపఖ్యాతి పాలు చేశారు
Also Read: కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలి : బండి సంజయ్