Telangana: ప్రగతి భవన్ వద్ద మారిన సీన్.. ఇనుప కంచెల తొలగింపు..

ప్రభుత్వం మారింది.. ప్రగతి భవన్ వద్ద సీన్ మారింది. ప్రగతి భవన్ ముందు ఉన్న భారీ ఇనుగ గేట్లు, షెడ్డును తొలగించేస్తున్నారు అధికారులు. గ్యాస్ కట్టర్‌ సాయంతో ఇనుక బారీకేడ్లను తొలగిస్తున్నారు. ప్రజల రాకపోకలకు వీలుగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

New Update
Telangana: ప్రగతి భవన్ వద్ద మారిన సీన్.. ఇనుప కంచెల తొలగింపు..

Pragathi Bhavan Scene Change : తెలంగాణలో ప్రభుత్వం మారడమే కాదు.. పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రగతి భవన్ (Pragathi Bhavan)వద్ద ఉన్న ముళ్ల కంచెలను తొలగిస్తోంది కొత్త ప్రభుత్వం. ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేసిన భారీ ఇనుప గేట్లు, షెడ్డును తొలగిస్తున్నారు అధికారులు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రగతి భవన్ లోపలికి వెళ్లకుండా పెద్ద పెద్ద గేట్లు, బారీకేడ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రగతి భవన్‌లో బయటి వ్యక్తులు ఒక్కరు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారింది.. పరిస్థితులు కూడా మారుతాయంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ప్రగతి భవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా గేట్లను తొలగించేస్తున్నారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో వాటిని కట్ చేసి తొలగించేస్తున్నారు.

మరికాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్ద నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. అంతకంటే ముందుగా పెద్దమ్మతల్లిని దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి. పెద్దమ్మతల్లి దర్శనం అనంతరం ఎల్బీ స్టేడియానికి బయలుదేరుతారు. మరోవైపు ఎల్లా హోటల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎల్బీ స్టేడియం వద్దకు బయలుదేరారు. ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు.

Also Read:

రేవంత్ పేరిట రెండు అరుదైన రికార్డ్స్.. తెలంగాణ పొలికల్ హిస్టరీలో సుస్థిరం..

మరికాసేపట్లో సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం..

Advertisment
Advertisment
తాజా కథనాలు