Revanth Reddy Swearing-in Ceremony 🔴Live Updates: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు.

New Update
Revanth Reddy Swearing-in Ceremony 🔴Live Updates: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Swearing-in Ceremony Live Updates: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క.. 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం  చేశారు. గవర్నర్ తమిళిసై వీరిచే  ప్రమాణం చేయించారు. కాగా, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎంతో సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

  • Dec 07, 2023 14:57 IST

    రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు



  • Dec 07, 2023 14:44 IST

    మరికాసేపట్లో సీఎం హోదాలో సచివాలయానికి రేవంత్ రెడ్డి



  • Dec 07, 2023 14:19 IST

    రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార వీడియో



  • Dec 07, 2023 14:16 IST

    ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం

    -- దివ్యాంగురాలు రజినికి ఉద్యోగ నియామక ఫైలుపై రెండో సంతకం



  • Dec 07, 2023 13:48 IST

    ప్రమాణ స్వీకారం తర్వాత సోనియాగాంధీకి రేవంత్ దంపతుల పాదాభివందనం



  • Dec 07, 2023 13:46 IST

    మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం



  • Dec 07, 2023 13:45 IST

    మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం



  • Dec 07, 2023 13:44 IST

    కొండాసురేఖ ప్రమాణ స్వీకారం తర్వాత హత్తుకున్న సోనియా



  • Dec 07, 2023 13:43 IST

    సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కేరింతలతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం



  • Dec 07, 2023 13:42 IST

    మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం



  • Dec 07, 2023 13:39 IST

    మంత్రిగా కొండ సురేఖ ప్రమాణం



  • Dec 07, 2023 13:38 IST

    మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణ స్వీకారం



  • Dec 07, 2023 13:38 IST

    మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం



  • Dec 07, 2023 13:33 IST

    ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు



  • Dec 07, 2023 13:31 IST

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



  • Dec 07, 2023 13:30 IST

    ప్రమాణ స్వీకారం చేసిన దామోదర్ రాజనర్సింహ



  • Dec 07, 2023 13:28 IST

    ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి



  • Dec 07, 2023 13:27 IST

    మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్క



  • Dec 07, 2023 13:27 IST

    సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి



  • Dec 07, 2023 13:19 IST

    హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్



  • Dec 07, 2023 13:16 IST

    ఎల్బీ స్టేడియానికి చేరుకున్న గవర్నర్



  • Dec 07, 2023 13:15 IST

    రేవంత్ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన ఏపీ నేత తిక్కవరపు సుబ్బరామిరెడ్డి



  • Dec 07, 2023 13:12 IST

    రేవంత్ సతీమణి గీత, కూతురుతో సోనియాగాంధీ ప్రత్యేక సంభాషణ



  • Dec 07, 2023 13:11 IST

    వేధికపైకి రాహుల్, ప్రియాంక



  • Dec 07, 2023 13:09 IST

    వేధికపైకి చేరుకున్న రేవంత్ రెడ్డి.. మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం



  • Dec 07, 2023 13:06 IST

    వేధికపైకి సోనియాగాంధీతో కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి



  • Dec 07, 2023 13:03 IST

    వేధికపైకి చేరుకున్న రేవంత్ సతీమణి గీత



  • Dec 07, 2023 12:38 IST

    పూజగదిలోని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి భట్టి పూజలు



  • Dec 07, 2023 12:23 IST

    తెలంగాణ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్



  • Dec 07, 2023 12:22 IST

    గాంధీభవన్ కు భారీగా చేరుకున్న కాంగ్రెస్ అభిమానులు



  • Dec 07, 2023 12:17 IST

    గాంధీభవన్ వద్ద బండ్ల గణేష్ డ్యాన్స్



  • Dec 07, 2023 12:15 IST

    ఎల్బీ స్టేడియం వద్ద కళాకారుల ప్రదర్శన



  • Dec 07, 2023 12:14 IST

    ఎల్బీ స్టేడియం వద్ద బోనాలతో మహిళల స్వాగతం



  • Dec 07, 2023 12:12 IST

    12.40కి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్న గవర్నర్ తమిళ సై



  • Dec 07, 2023 12:10 IST

    రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్న వారికి కళాకారుల ఘన స్వాగతం



  • Dec 07, 2023 12:05 IST

    రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన ఎల్బీ స్టేడియం



  • Dec 07, 2023 12:00 IST

    ఎల్బీ స్టేడియం వద్ద రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి



  • Dec 07, 2023 12:00 IST

    ఎల్బీ స్టేడియానికి బయల్దేరిన రేవంత్ సతీమణి గీతా రెడ్డి, కుటుంబ సభ్యులు



  • Dec 07, 2023 11:59 IST

    సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గ కూర్పు

    -కేబినెట్‌లో ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, బీసీలు ఇద్దరు, ఓసీలు ఆరుగురు
    -రెడ్డి సామాజికవర్గానికి 3 మంత్రి పదవులు
    -ఎస్సీ సామాజికవర్గానికి 2 మంత్రి పదవులు
    -బీసీ సామాజికవర్గానికి 2 మంత్రి పదవులు
    -ఎస్టీ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి
    -వెలమ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి
    -కమ్మ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి
    -బ్రాహ్మణ సామాజికవర్గానికి ఒక మంత్రి పదవి



  • Dec 07, 2023 11:54 IST

    12:45 గంటలకు ఎల్బీ స్టేడియం కు చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి..



  • Dec 07, 2023 11:51 IST

    12:45 గంటలకు ఎల్బీ స్టేడియానికి రేవంత్ రెడ్డి

    12:55 గంటలకు ఎల్బీస్టేడియం చేరుకోనున్న గవర్నర్

    1:04 గంటలకు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

    1:25 గంటలకు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం..

    చివరగా గవర్నర్, సీఎం తో మంత్రి మండలి గ్రూప్ ఫోటో .



  • Dec 07, 2023 11:11 IST

    హైదరాబాద్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్



  • Dec 07, 2023 11:09 IST

    ఎల్‌బీ స్టేడియం, సచివాలయం దగ్గర 2వేల మంది పోలీసులతో బందోబస్తు



  • Dec 07, 2023 11:09 IST

    ఎల్బీనగర్ 8వ నంబర్ గేటు నుంచి రేవంత్ రెడ్డి ఎంట్రీ

    ఎల్బీ నగర్ స్టేడియంలో 8వ నంబర్ గేట్ నుండి ముఖ్యమంత్రి ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు.  ఈ కార్యక్రమానికి మొత్తం 80వేల మందిని స్టేడియంలోకి అనుమతించే  అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, సిసిటీవీ కెమెరాలతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు.



  • Dec 07, 2023 11:07 IST

    ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక నేరుగా సచివాలయానికి రేవంత్ రెడ్డి

    ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.



  • Dec 07, 2023 11:05 IST

    ఇప్పుడు కాదు.. ఆ తరువాతే.. కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్..



  • Dec 07, 2023 11:04 IST

    కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకే.. రేపే రేవంత్ సంతకం!



  • Dec 07, 2023 11:04 IST

    రేవంత్ ప్రమాణస్వీకారానికి ఆహ్వాన పత్రిక ఇదే!



  • Dec 07, 2023 11:02 IST

    పెద్దమ్మ గుడి నుంచి ఎల్బీనగర్ స్టేడియానికి రేవంత్



  • Dec 07, 2023 11:01 IST

    రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు