రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఏటా ఎంసెట్ (EAMCET) పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రవేశపరీక్ష పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తీసివేసి.. ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలా కొనసాగుతూనే ఉంది. అయితే దాన్ని తొలగించాలని ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో చర్చలు కూడా జరిగాయి.
Also read: అప్పటికి భారత్ లో పది కోట్లమంది సంపన్నులు
ఎం అక్షరం తొలగింపు
మెడికల్ పేరును తొలగించాలని కోరుతూ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అనే అక్షరాన్ని తొలగించి.. టీఎస్‌ఈఏపీసెట్(TSEAPCET) లేదా టీఎస్‌ఈఏసెట్ (TSEACET) అని మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీ ఫార్మసీ సీట్లను కూడా ఎంసెట్ నుంచే భర్తీ చేయడం వల్ల పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు తెలుస్తోంది.
టీఎస్‌ఈఏపీ సెట్ లేదా టీఎస్‌ఈఏ సెట్
మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తొలగించి, టీఎస్‌ఈఏపీ సెట్ లేదా టీఎస్‌ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇక్కడ పీ అంటే ఫార్మసీ అని అర్థం. బీఫార్మసీ సీట్లను ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని పొందుపరిచినట్లు సమాచారం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు కలిపి ఈఏపీ సెట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: రామాలయ ప్రారంభోత్సవం.. అమెరికాలో 21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు..