Prime Minister Modi : హిందువుల విశ్వాసాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు

భారతదేశంలో హిందువుల విశ్వాసాన్ని తొలగించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ. బీజేపీ కేవలం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు.

New Update
PM Modi: ఒకవేళ అలా చేస్తే అవే నా చివరి ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

BJP : ఒక రోజు విరామం తర్వాత తిరిగి ఎన్నికల ప్రచారాన్ని(Election Campaign) ప్రారంభించారు ప్రధాని మోదీ(PM Modi). ఈరోజు మహారాష్ట్ర(Maharashtra)లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ(Congress Party) పై సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలో హిందువుల విశ్వాసాన్ని తొలగించడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అన్నారు. రామ మందిర నిర్మాణం భారతదేశ ఆలోచనకు విరుద్ధమని షెహజాదా గురువు అమెరికాకు కూడా చెప్పారని మోదీ తెలిపారు.

ALSO READ: మోదీ ఇక ప్రధాని కాలేరు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

‘‘అభివృద్ధి విషయంలో మోదీతో పోటీ పడలేరని కాంగ్రెస్‌కు తెలుసు అందుకే ఈ ఎన్నికల్లో అబద్ధాల ఫ్యాక్టరీని తెరిచారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పరిస్థితి ‘చోర్ మచాయే షోర్’లా ఉంది.. మత ఆధారిత రిజర్వేషన్ బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి విరుద్ధం. మతపరమైన రిజర్వేషన్‌లను ప్రేరేపించడం రాజ్యాంగాన్ని రూపొందించిన వారిని వెన్నుపోటు పొడిచినట్లే, కొలవలేని పాపం." అని అన్నారు.

"'నేను గత 17 రోజులుగా కాంగ్రెస్‌ను సవాలు చేస్తున్నాను.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముక్కలుగా చేసి ముస్లింలకు ఒక్క ముక్క ఇవ్వబోమని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరాను, కానీ వారు సమాధానం ఇవ్వడం లేదు.. నేను చేసిన సవాల్ పై కాంగ్రెస్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు" అని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు