Telangana: వారే నాపై కుట్ర చేసి ఐటీ దాడులు చేశారు.. వివేక్‌ సంచలన ఆరోపణలు..

కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఈరోజు ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు ముగిశాయి. ఎన్నికల్లో గెలవలేకే బీఆర్‌ఎస్, బీజేపీ కలసి తనపై కుట్ర చేసి దాడులకు పాల్పడ్డాయని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమాన్ ఫిర్యాదు వల్లే తనపై సోదాలు జరిగాయన్నారు.

New Update
Telangana: వారే నాపై కుట్ర చేసి ఐటీ దాడులు చేశారు.. వివేక్‌ సంచలన ఆరోపణలు..

మంచిర్యాలలోని మంగళవారం ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి వివెక్‌ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు పదిగంటలకు పైగా తనిఖీలు జరిగి సాయంత్రం నాటికి ముగిశాయి. అయితే ఐటీ సోదాలు ముగిసిన అనంతరం వివేక్‌ స్పందించారు. బీఆర్ఎస్‌ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేయడంతోనే తనపై ఐటీ దాడులు జరిగాయని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేకే బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి తమపై కుట్ర చేసి ఐటీ దాడులకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఐటీ దాడులు చేసే దమ్ము లేదు కానీ నాపై చేశారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి మరీ దాడులు చేశారంటూ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుందని.. చెన్నూరు నుంచి తానే గెలవనున్నాని వ్యాఖ్యానించారు.

Also Read: నన్ను చంపేస్తారు.. బర్రెలక్క సంచలన ప్రెస్ మీట్!

అయితే ఇటీవల విశాఖ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాల్లోకి భారీగా నగదు జమ కావడం గురించి ఐటీ అధికారులు వివేక్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవలే వివేక్‌ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో వెంటనే ఆయనకు చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడిన కొన్ని రోజులకే ఆయనపై ఐటీ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు నవంబర్‌ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ నేతలు తమ ప్రచారాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక డిసెంబర్ 3న 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also read: కేసీఆర్ అందుకే అలా చెబుతున్నాడు.. భట్టి కీలక వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు