Mynampally Hanumanth Rao: వస్తే దగ్గరుండి ఓడిస్తాం.. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌లో 'మైనంపల్లి' రచ్చ..

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌లో మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ చిచ్చు రేగింది. పార్టీలోకి మైనంపల్లి వద్దే వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక కాంగ్రెస్ కేడర్‌. మధ్యలో వచ్చిన మైనంపల్లికి కాకుండా.. మొదటి నుంచి ఉనన నందికంటి శ్రీధర్‌కే ఎమ్మెల్యేకెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మైనంపల్లికి సీటు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Mynampally Hanumanth Rao: వస్తే దగ్గరుండి ఓడిస్తాం.. మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌లో 'మైనంపల్లి' రచ్చ..
New Update

టిTelangana Elections: మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌లో మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీ చిచ్చు రేగింది. పార్టీలోకి మైనంపల్లి(Mynamapally Hanumantharao) వద్దే వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక కాంగ్రెస్ కేడర్‌(Congress Cadre). మధ్యలో వచ్చిన మైనంపల్లికి కాకుండా.. మొదటి నుంచి ఉనన నందికంటి శ్రీధర్‌కే ఎమ్మెల్యేకెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మైనంపల్లికి సీటు ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గతంలో శ్రీధర్‌కే టికెట్ ఇస్తామంటూ హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు శ్రీధర్‌కే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ నేతలకు అన్యాయం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. శ్రీధర్‌కు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మైనంపల్లి లాంటి వారు వస్తుంటారు.. పోతుంటారని, పార్టీలో మొదటి నుంచి ఉన్న, పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు.

మైనంపల్లి హనుమంతరావుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసింది శ్రీధర్ అని, ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కష్టపడ్డ నాయకులను గుర్తించి టికెట్ ఇవ్వాలంటున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే.. ఏం చేయాలో అది చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. అంతా సానుకూలంగా ఉన్న సమయంలో మధ్యలో ఎవరో వస్తే.. టికెట్ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మధ్యలో వచ్చిన వారికి గులాంగిరీ చేయలేం తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. వారి ముందు చేతులు కట్టుకుని, నమస్తే చెప్పడం సాధ్యమయ్యే పని కాదంటున్నారు. ఒకవేళ తమ అభ్యర్థనను పట్టించుకోకుండా మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇచ్చినా ఆయనను గెలిపించేందుకు తాము కృషి చేయబోమని తేల్చి చెబుతున్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ కేడర్. ఇప్పటికే అనేక పార్టీల్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు.. కాంగ్రెస్‌లోచేరి, కాంగ్రెస్‌ కోసం పని చేస్తారని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.

టికెట్ రాకపోతే..?

వేల కోట్లు ఉంటేనే టికెట్ ఇస్తారా? కిందిస్థాయి నుంచి కష్టపడి ఎదిగిన, పార్టీని అభివృద్ధి చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ కార్యకర్తలు. హనుమంతరావుకు టికెట్ ఇస్తే గనుక.. దగ్గరుండి మరీ ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే.. ఆయనపై బోలెడు కేసులు ఉన్నాయని, మల్కాజిగిరి ప్రజలందరిలో ఆయనపై చెడు అభిప్రాయం ఉందంటున్నారు. ఆయన్ను పార్టీలో యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సర్వేలన్నీ శ్రీధర్‌కు, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో.. ఆయన వస్తున్నాడని మైనంపల్లిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు నేతలు. మైనంపల్లి పెద్ద లీడర్ కాబట్టి.. వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసుకోవాలని సూచించారు. బీసీలకు అన్యాయం చేయడం సరికాదంటున్నారు. బీసీలు కేవలం కష్టపడటానికేనా? ఓట్లు వేయడానికేనా? పోటీ చేయడానికి పనికిరామా? అని పార్టీ హైకమాండ్‌ను నిలదీస్తున్నారు మల్కాజిగిరి కాంగ్రెస్ నేతలు. ఇప్పుడున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా ఎంపీగా గెలిపించేందుకు చాలా కష్టపడ్డాం అని నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు నేతలు. సర్వేల్లో శ్రీధర్‌కు తక్కువ పాపులారిటీ ఉందని అంటున్నారని, అది తమకు చూపించాలని సవాల్ విసిరారు. మైనంపల్లికి అంత క్రేజ్ ఉంటే.. సొంత బలం ఉంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు.

మొత్తానికి మైనంపల్లి రాక.. మల్కాజిగిరి కాంగ్రెస్‌లో ఓ రేంజ్‌లో కాక పెంచుతోంది. ఒకవేళ టికెట్‌ను మైనంపల్లికే కన్ఫామ్ చేస్తే మాత్రం కందికంటి శ్రీధర్ తన దారి తాను చూసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన అనుచరులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. టికెట్ దక్కకపోతే శ్రీధర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి మల్కాజిరిగి రాజకీయం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read:

AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగుల‌కు జగన్ సర్కార్‌ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం!

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

#congress #hyderabad #telangana-elections #telangana-congress #mynampally-hanmanth-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe