T Congress: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

6 గ్యారెంటీల పథకానికి ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించనుంది రాష్ట్ర సర్కార్. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి జనవరి 6వరకు కొనసాగనుంది.

T Congress: రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!
New Update

Congress Six Guarantees : కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల హామీ పథకాల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి మొదలై జనవరి 6 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా 10రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు(Aadhaar Card) జిరాక్స్‌తో పాటు, వైట్ రేషన్ కార్డు(Ration Card) జిరాక్స్‌ను కూడా జతచేయాలి. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి..వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

                                               DOWNLOAD APPLICATION FORM HERE

ఏ పథకానికి ఏమేమి కావాలి..?

* అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం రెడీ చేసింది ప్రభుత్వం. అన్ని పథకాలకూ ఒకే అప్లికేషన్ ను సిద్ధం చేసింది. కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, ఇలా కుటుంబ సభ్యుల వివరాలను నింపాలి.

ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

* మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్కు పెట్టాలి. రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్లు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజన్సీ పేరు, ఏడాదికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాలి.

* ఇక రైతు భరోసా కోసం లబ్ది పొందే వ్యక్తి..రైతా, కౌలు రైతా టిక్ చేసి..పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి ఏకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే.. ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.

* ఇక ఇందిరమ్మ ఇళ్లు పొందాలనుకునే వాళ్లు..ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి.
* ఇక గృహ జ్యోతి పథకం కోసం.. నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తారన్నది యూనిట్లలో నమోదు చేయాలి. దీంతో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి.

* ఇక చేయూత పథకం పొందాలనుకునేవారు..దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి. లేదా.. వాళ్లు వృద్ధులా, వితంతువుల, బీడీ కార్మికులా, చేనేత కార్మికులా అన్నది వాళ్లకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

#cm-revanth-reddy #new-ration-cards #congress-six-guarantees #six-guarantee-application-form #pension-apply
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe