మహారాష్ట్రలోని పుణెలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఒక ప్రముఖ కంపెనీ క్యాంటీన్‌లోని అక్కడ సమోసాల్లో కండోమ్‌లు, రాళ్లు, పొగాకు, గుట్కా వంటివి కనిపించడం కలకలం రేపింది. మార్చి 27న జరిగిన ఈ ఘటన తాజాగా బయటపడింది. సమాచారం మేరుకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు. ఇందులో ప్రమేయం ఉన్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
Also read: కోర్టుకు ఎమోషనల్ లేఖ రాసిన కవిత..
ఇలాంటి దారుణానికి పాల్పడింది ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ అని తెలిసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ పాత కాంట్రాక్టర్‌తో క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ను కంపెనీ రద్దు చేసుకుంది. ఇందుకోసం కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ యాజమాన్యంపై ఆ పాతకాంట్రక్టర్ ప్రతీకారం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆ కంపెనీ పేరు, ప్రతిష్టలను దెబ్బతీయాలని అనుకున్నాడు. ఇందుకోసమే ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమవుతోంది. కాంట్రాక్ట్ కోసం ఇలాంటి నీచ స్థాయికి దిగజారడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు!