Consumer Complaints : మార్కెట్‌లో ఎవరైనా ఎమ్మార్పీ (MRP) ధర కన్నా ఎక్కువగా అమ్ముతున్నారా ? నాసిరకం ఉత్పత్తులు పెడుతున్నారా ?.. ఇకనుంచి ఇంటినుంచే వాళ్లపై వినియోగదారుల కమిషన్ (Consumer Commission) కు ఫిర్యాదు చేయచ్చు. ఇందుకోసం కేంద్ర వినియగదారుల మంత్రిత్వ శాఖ 'వాట్సప్ చాట్‌బాట్' (WhatsApp Chat Bot) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు చేయాలనుకునేవారు వాట్సాప్‌లో 88000 01915 నంబర్‌కు హాయ్ అని టైప్ చేయాలి. అక్కడ సూచనల ఆధారంగా డిటైల్స్ ఫిల్ చేస్తే.. జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు అవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన కేసు పరిష్కారం కోసం.. ఈ వివరాలను జిల్లా వినియోగదారుల కమిషన్‌కు పంపుతారు.
Also read: ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
ఈ కేసు పరిష్కారం అయ్యేవరకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కూడా కాల్ చేసి (ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు) ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే ప్రతిరోజూ వేలాది ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇందులో పరిష్కారమైన కేసుల వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https://consumerhelpline.gov.in/ వెబ్‌సైట్‌లో ‘ఎన్‌సీహెచ్ సక్సెస్ స్టోరీస్’ పేరుతో విడుదల చేస్తోంది.
Also read: రాజ్‌తరుణ్ లవ్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. ఊహించని షాక్ ఇచ్చిన మల్హోత్రా!