Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?

నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద అధికారులు ఉచిత పార్కింగ్‌ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఇచ్చి.. ఇప్పుడు సడెన్ గా డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు.

New Update
Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?

హైదరాబాద్‌లో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉచిత పార్కింగ్‌ను ఎత్తివేస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకోవడంతో అక్కడి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల వరకు నాగోల్ మెట్రో స్టేషన్‌ వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉండేది. ఈ నేపథ్యంలోనే దూర ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసే చాలామంది ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లో వారి వాహనాలను పార్క్ చేసి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు మెట్రో అధికారులు ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేయడంతో ప్రయాణికులు ధర్నాకు దిగారు.

Also Read: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం

మెట్రో వద్ద కనీసం రెండు గంటలు పార్క్ చేస్తే రూ.10, 8 గంటల వరకు పార్క్ చేస్తే రూ.25, 12 గంటలకు రూ.40 కట్టాలి అని బోర్డు పెట్టారు. ఇక కార్లకు కనీసం రెండు గంటలు పార్క్ చేస్తే రూ.30, 8 గంటలకు రూ.75, 12 గంటలకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు. దీంతో ఇది చూసిన ప్రయాణికులు మండిపడ్డారు. ఇప్పటివరకు ఫ్రీగా పార్కింగ్ పెట్టి ఇలా ఒక్కసారిగా ధరలు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. ఆ సంచలన నేతకు ఛాన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు