Cocaine: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 50 కోట్లు విలువైన కొకైన్‌ స్వాధీనం

భాగ్యనగర్‌లో మరోసారి డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. శంషాబాద్‌ ఎయిర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి తీసుకు వచ్చినట్లు గుర్తించారు ఎయిర్ పోర్టు అధికారులు.

New Update
Cocaine: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 50 కోట్లు విలువైన కొకైన్‌ స్వాధీనం

హ్యాండ్‌ బ్యాగ్‌లో డ్రగ్స్..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్రౌన్ టేప్‌తో చుట్టబడిన నిషిద్ధ వస్తువులు చెక్-ఇన్ సూట్‌కేస్ యొక్క తప్పుడు అడుగు భాగంలో మరియు చెక్-ఇన్ బ్యాగేజీలో నలుగురు మహిళలు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. హ్యాండ్‌ బ్యాగ్‌లో కింది భాగంలో బ్రౌన్ టేపు వేసి డ్రగ్స్‌ మొత్తం 5 కేజీల కొకైన్ విలువ దాదాపు రూ.50 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. సదరు ప్రయాణికులు లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లి ఢిల్లీకి ఈ ముఠా తరలిస్తున్నది తెలిపారు. నలుగురు మహిళా ప్రయాణికులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఇంకా ఉన్నారేమో..  

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నలుగురు మహిళలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఎయిర్ పోర్టు  అధికారులు. గతంలో కూడా విమాన ప్రయాణికులు కొకైన్ దాచిపెట్టిన కేసులు DRI అధికారుల వెలుగుచూశాయి.  ఈ ఏడాది  పలువురు ప్రయాణికులు కొకైన్ తరలిస్తుండగా పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ పోర్ట్‌లో రూ.50 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇంక ఎవరైనా ఉన్నారేమో అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు