వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ కు వెళ్ళిన జట్టు భారత్ ఒక్కటే. లీగ్ మ్యాచ్ లు అయిపోయాయి. తరువాత సెమీస్. టీమ్ ఇండియా సెమీస్ లో న్యూజిలాంగ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా టీమ్ ఇండియానే ఫేవరెట్. కానీ భారత్ కు సెమీస్ గండం ఉంది. అంత వరకూ చాలా బాగా సెమీస్ లో బొక్క బోర్లా పడిన సందర్భాలూ ఉన్నాయి. పైగా ఇదే న్యూజిలాండ్‌తో 2019లో ఓడిపోయింది భారత్. ఇప్పుడు ఆ కసిని తీర్చుకోవాలని అనుకుంటోంది. అదే ప్రస్తుతం భారత్ టీమ్ కు ఒత్తిడిగా కూడా మారింది. దీని మీద టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read:లిరిక్ తెలియదా..ఏం పర్లేదు, హమ్ చేసినా చాలు యూట్యూబ్ వెతికేస్తుంది.
సెమీస్ లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఎంత వరుస విజయాలు సాధించినా ఓడిపోవడానికి ఒక్క మ్యాచ్ చాలు అంటూ వ్యాఖ్యానించారు రాహుల్. ఒకటి ఓడిపోతే అప్పటివరకూ అందలం ఎక్కించేనవారే...వీళ్ళకి ఏమీ రాదు అంటూ తొక్కేస్తారు కూడా. అందుకే చెబుతున్నా టీమ్ ఇండియాకు సెమీస్ ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతీ మ్యాచ్ కొత్తగా ఆడాలి. చివరి వరకు ఏ టీమ్ గెలుస్తుంది అనేది చెప్పలేము. అయితే మైదానంలో ప్రణాళికలను అమలు చేస్తే.. మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చు. ఇదంతా ఆటలో సహజమే అంటూ చెప్పుకొచ్చారు ద్రావిడ్.
నెదర్లాండ్స్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడం చాలా ఆనందం కలిగించిందని చెప్పారు కోచ్ ద్రావిడ్. నాలుగో స్థానంలో ఆడే మంచి ఆటగాడి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి దొరికాడు. అయ్యర్ రూపంలో మా అన్వేషణ ఫలించిందని చెప్పారు. ఈ ప్రపంచకప్‌లో వరుసగా 9 మ్యాచుల్లోనూ విజయం సాధించాం. తొలి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఆడాం. సెమీస్ మ్యాచ్‌లో ఇలాగే ఆడతాం అని రాహుల్ ద్రావిడ్ కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారు.