వరదలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్‌ చేస్తున్నామని అన్నారు సీఎం. టీఆర్‌-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నానని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా..

New Update
Andhra Pradesh: అభ్యర్థుల ఖరారుపై జగన్‌ ఫోకస్‌..నేరుగా నేతలతోనే చర్చలు..

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్‌ చేస్తున్నామని అన్నారు సీఎం. టీఆర్‌-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నానని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది.. దీని తర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత నేను వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను సీఎం జగన్ వెల్లడించారు.

బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను.. ఈ సారి కూడా నేను వస్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను.. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో.. అలాంటి సహాయమే అందించాలన్నారు. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి ఖచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ అందించాలన్నారు. దీంతో పాటు తాగునీరు కూడా అందించాలని సూచించారు. సహాయం అందని వరద బాధిత కుటుంబం ఉండకూడదని స్పష్టం చేశారు జగన్. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలన్న సీఎం.. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలని సూచించారు.

వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు.. వారందరికీ కూడా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలను కొనసాగించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి.. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. పీహెచ్‌సీల్లో, విలేజ్‌ క్లినిక్స్‌ లో అన్ని రకాల మందులు ముందుగానే ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాను ఉంచండంటూ ఆదేశాలు జారీ చేశారు.

అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించాలని సూచించారు. అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి.. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండని సీఎం జగన్ తెలిపారు. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా వారికోసం ఇళ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే అన్నారు. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలన్నారు. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది.. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి అని స్పష్టమైన ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు.. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండని సూచించారు సీఎం జగన్‌. పశువులకు గ్రాసం కొరతలేకుండా, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలన్నారు. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలన్నారు. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదన్నారు. సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను.. నేను ఎక్కడకు వచ్చేదీ ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తానని వెల్లడించారు సీఎం జగన్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు