Drugs Case : డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు.. సీఎం రేవంత్!

డ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులున్నా, స్టార్ సినీ సెలబ్రిటీలున్నా ఎవరినీ ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు సీఎం రేవంత్. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు.

New Update
CM Revanth: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు

Telangana : తెలంగాణ, హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ కేసు (Drugs Case) లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ కేసుల్లో ఎంతటి ప్రముఖులున్నా, స్టార్ సినీ సెలబ్రిటీలున్నా ఎవరినీ ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అన్నారు.

ఈ మేరకు శనివారం గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో నార్కొటిగ్స్ వింగ్ సాధించిన పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలను ముఖ్యమంత్రికి అందించారు. దీంతో రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపాలని, మరింత యాక్టివ్‌గా పనిచేయాలన్నారు సీఎం రేవంత్. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, సప్లై చైన్‌ను బ్రేక్ చేయాలని చెప్పారు. మత్తు పదార్థాలు సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలన్నారు. అవసరాలకు అనుగుణంగా యాంటీ డ్రగ్స్ టీమ్‌ (Anti Drugs Team) లను ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్‌గా పనిచేసేవారిని ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదాన్ని వింటేనే భయపడేలా చర్యలుండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కొటిక్స్ బ్యూరో ఆదర్శంగా నిలవాలన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం, సహాయం కావాలన్నా సమకూర్చడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Also Read : ఫైర్ బ్రాండ్ రోజా సైలెన్స్.. టీడీపీ అభ్యర్థి రూల్స్ బ్రేక్.. నగరి రిజల్ట్ మాత్రం సస్పెన్స్!

Advertisment
తాజా కథనాలు