CM Revanth: పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్‌ పేరు లేదు: సీఎం రేవంత్

సెప్టెంబర్ 17లోగా చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ చేసిన ప్రకటనలో నిజామాబాద్ పేరు ఎక్కడాలేదన్నారు. నిజామాబాద్‌లో బోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పకుండా కేవలం ఒక నోట్ విడుదల చేశారంటూ విమర్శించారు.

New Update
TG Jobs : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్!

CM Revanth Reddy On Nizamabad Turmeric Board : నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17లోగా చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ప్రధాని మోదీపై కూడా విరుచుకుపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ చేసిన ప్రకటనలో నిజామాబాద్ పేరు ఎక్కడాలేదన్నారు. నిజామాబాద్‌లో బోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పకుండా కేవలం ఒక నోట్ విడుదల చేశారంటూ విమర్శలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదని పేర్కొన్నారు.

' నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకంగా అభిమానం ఉంది. మేము అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ గురించి ఆలోచించాం. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశాం. కవిత (Kavitha) ఎంపీగా ఉన్న సమయంలో ఇక్కడి రైతులను పట్టించుకోలేదు. పసుపు బోర్డు ఏర్పాటుపై అప్పట్లో బాండు రాసిచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు రైతులను మోసం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చక్కెర పరిశ్రమ, పసుపు బోర్డులను జీవన్‌ రెడ్డి సాధిస్తారు. ప్రధాని మోదీ దేవుడిని, భక్తిని ఓట్లుగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని కాపాడాలంటే మళ్లీ కాంగ్రెస్ గెలవాలని' సీఎం రేవంత్ అన్నారు.

Also Read: ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచ‌ర్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు