CM Revanth: బీఆర్‌ఎస్‌.. బీజేపీకి సపోర్ట్‌ చేసింది.. అసెంబ్లీలో రేవంత్ ఫైర్

గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. కేంద్రం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయం కూడా ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి చెప్పారని అన్నారు. కేసీఆర్‌.. పార్టీ నేతలకు కొన్ని విషయాలు చెప్పరని ఎద్దేవా చేశారు.

New Update
CM Revanth: బీఆర్‌ఎస్‌.. బీజేపీకి సపోర్ట్‌ చేసింది.. అసెంబ్లీలో రేవంత్ ఫైర్

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నయి. అధికార, విపక్ష పార్టీల మధ్య వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ బీఆర్‌ఎస్ పార్టీకీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీకి అండగా నిలిచిందని విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు కూడా బీఆర్ఎస్‌ పార్టీ మద్దతు పలికిందని ధ్వజమెత్తారు. ఇరుపార్టీల నేతలు కలిసి పలుసార్లు చర్చలు కూడా జరిపారని ఆరోపించారు.

Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!

ముఖ్యమంత్రిని మార్చుకునే విషయం కూడా ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చిన చెప్పినట్లు రేవంత్ అన్నారు. కేసీఆర్‌ తన పార్టీ నేతలకు కొన్ని చెప్పి.. మరికొన్ని దాస్తారంటూ విమర్శలు చేశారు. మరోవైపు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని.. మీరిచ్చిన హామీలను మీకే గుర్తు చేస్తున్నామని అన్నారు. హామీలన్ని నెరవేరిస్తే.. మీకే మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని మార్చేందుకు మాకు ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు. అలాగే మాకు బీజేపీతో కూడా ఎలాంటి సంబంధం లేదు.

Also Read: దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు

Advertisment
తాజా కథనాలు