GHMC: హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరాన్ని గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతున్నట్లు తెలిపారు.

New Update
CM Revanth Reddy: రైతు ఆత్మహత్య.. సీఎం రేవంత్ సీరియస్

Hyderabad: గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిమాపక విభాగం అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ఆదివారం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదు, విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తూ ఉంటారని తెలిపారు.

ఎంతో అభివృద్ధి చేశారు..
ఈ మేరకు ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమన్నారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం లేకపోవడం మంచిది కాదన్నారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో ఆ నగరం అభివృది చెందుతుందన్నారు. గత ముప్పై ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలు ను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదన చేశారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకోస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకు రాబోతున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Traffic: ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి.. రాష్ డ్రైవింగ్ చేశారో అంతే సంగతి!

2050 మెగా మాస్టర్ ప్లాన్..
హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్లాన్ చేశామమన్నారు. 2050 మెగా మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకు పోతామన్నారు. అర్బన్ తెలంగాణా, రూరల్ తెలంగాణా ను అభివృద్ధి చేస్తామన్నారు. ఫార్మ సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు సరైనది కాదన్నారు. ఫార్మ్ సిటీలో మీరు ప్లాన్ చేస్తే మేము పల్లె లో ప్లాన్ చేస్తున్నామని, 10 నుండి 15 విలేజ్ లో ఫార్మ్ ను ప్లాన్ చేస్తున్నామన్నారు. ఒకే ప్రాంతము 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందని, అపోహాలకు ఎవరు లోను కాకండని సూచించారు. రాజకీయంగా నాకు అవగాహన ఉంది, నిర్మాణంలో నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. మేము అంతకు మేము అపర మేధావులు అని నిర్ణయాలు తీసుకోబోమన్నారు. అలా నిర్ణయాలు తీసుకుంటే.. మేడి గడ్డ అవుతుందన్నారు. పరిపాలన పై నాకు కొంత సమయం కావాలి, ఎవరు కుడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు