CM Revanth Reddy: నన్ను బెదిరిస్తారా?.. మోడీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ TG: మోడీ రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు అడగాలని మోడీకి సవాల్ విసిరారు. By V.J Reddy 01 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy Warned PM Modi: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం RR ట్యాక్స్ వసూలు చేస్తోందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనకు మోడీ ఒప్పుకోవడం లేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో రిజర్వేషన్‌లను ఎత్తి వేయాలనే ఆలోచనలో బీజేపీ ఉందని అన్నారు. కార్పొరేట్లకు దేశాన్ని అమ్మలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనుల జీవితాల్లో మార్పు రాలేదని పేర్కొన్నారు. Also Read: హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఫైరింగ్.. నిందితుడు సూసైడ్ పదేళ్లు తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని అన్నారు. ప్రశ్నిస్తే మోడీ, అమిత్ షా నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులు నన్ను భయపెట్టాలని చూస్తున్నారని.. గతంలో కేసీఆర్ కూడా నాపై అనేక అక్రమ కేసులు పెట్టారని అన్నారు. బీజేపీ దగ్గర ఈడీ, సీబీఐ, ఐటీ ఉంటే నా దగ్గర 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. మా రాష్ట్రానికి వచ్చి నన్ను బెదిరిస్తారా? అని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోడీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని ఆరోపణలు చేశారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని సీఎం రేవంత్ అన్నారు. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు అడగాలని బీజేపీకి సవాల్ విసిరారు సీఎం రేవంత్. ఎన్నికల ప్రచారాన్ని మానేసి నేను ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు కావాలా? అని అన్నారు. #cm-revanth-reddy #pm-modi #modi #amit-shah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి